News December 1, 2025

వరంగల్: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 74 కేసులు నమోదు

image

మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 74 కేసులు నమోదయ్యాయి. ఇందులో సెంట్రల్ జోన్‌లో 23, ట్రాఫిక్‌లో 20, వెస్ట్ జోన్‌లో 19, ఈస్ట్ జోన్‌లో 12 కేసులు నమోదయ్యాయి.

Similar News

News February 12, 2026

స్కూళ్లకు బంద్ లేనట్లే..!

image

భారత్ <<19115946>>బంద్<<>> ప్రభావం తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లపై అంతగా లేనట్లు తెలుస్తోంది. ఇవాళ స్కూల్‌కు సెలవు అని మెసేజులు రాలేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యార్థి సంఘాలు ఈ బంద్‌లో పాల్గొనట్లేదు కాబట్టి అంతరాయం కలిగించే అవకాశాలు లేవు. బ్యాంకులు, రవాణా, ప్రభుత్వ కార్యాలయాలపై బంద్ ప్రభావం పడే అవకాశం ఉంది. మరి ఇవాళ స్కూళ్లకు హాలిడే అని మీకేమైనా మెసేజ్ వచ్చిందా? కామెంట్ చేయండి.

News February 12, 2026

చిన్నారులకు నాన్‌వెజ్ ఎప్పుడు పెట్టాలంటే?

image

పిల్లల ఎదుగుదలలో ఆహారం కీలకపాత్ర పోషిస్తోంది. 6నెలల నుంచి పిల్లలకు నెమ్మదిగా ఘనాహారం అలవాటు చెయ్యాలని నిపుణులు సూచిస్తున్నారు. 8నెలల నుంచి మాంసాహారం ఇవ్వాలి. ముందుగా ఉడికించిన గుడ్డు, సంవత్సరం దాటిన తర్వాత చికెన్, చేపలు పెట్టాలి. వాటిని బాగా ఉడికించి మెత్తగా చేసి పిల్లలకు పెట్టాలని చెబుతున్నారు. మాంసాహారంలో ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి నెమ్మదిగా పిల్లలకు అలవాటు చెయ్యాలంటున్నారు.

News February 12, 2026

VZM: ఆసుపత్రి ముంగిటే మృతి

image

విజయనగరం మహారాజ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం కలకలం రేపింది. ఆసుపత్రి క్యాజువాలిటీ వద్ద సుమారు 30 ఏళ్ల వయస్సు ఉన్న యువకుడు అచేతనంగా పడిఉన్నా సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. అయితే తమ వైద్య సిబ్బంది వెంటనే స్పందించి, అతడిని లోపలికి తీసుకువెళ్లి చికిత్స అందించారని అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు సూపరింటెండెంట్ డా.పద్మజ తెలిపారు.