News February 5, 2025
వరంగల్: తాత అంత్యక్రియలకు వెళ్లి మనవడు మృతి

వరంగల్ జిల్లాలో విషాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. దుగ్గొండి మండలం మైసంపల్లికి చెందిన వృద్ధుడు పిట్టల మల్లయ్య అనారోగ్యంతో సోమవారం సాయంత్రం మృతిచెందాడు. కాగా అంత్యక్రియల్లో పాల్గొని చెరువులో స్నానం చేస్తున్న క్రమంలో మల్లయ్య మనవడు పిట్టల రంజిత్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఈరోజు చనిపోయాడు. తాత,మనవడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.
Similar News
News January 21, 2026
నల్గొండ: బకాయిలపై ప్రత్యేక దృష్టి

ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్త్రీనిధి రుణాల్లో పెరిగిన మొండి బకాయిల వసూలుపై అధికారులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. మార్చి 31లోగా 100% రికవరీ లక్ష్యంతో మహిళా సంఘాల సభ్యుల వద్దకు వెళ్లి బకాయిల వసూళ్లు చేపడుతున్నారు. రుణాలు చెల్లించకపోతే చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వసూలు జరిగితేనే కొత్త లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయగలమని, అందుకే సభ్యులు వారి వాయిదాలు సకాలంలో చెల్లించాలంటున్నారు.
News January 21, 2026
భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టాడు

TG: వనపర్తికి చెందిన ఆంజనేయులు, సరస్వతి (34) HYD బోరబండలో అద్దెకు ఉంటున్నారు. వీరికి 12ఏళ్ల కుమారుడు, 9 ఏళ్ల కూతురు ఉన్నారు. భర్త ఉద్యోగం మానేయడంతో ఆర్థిక సమస్యలు తీవ్రమై గొడవలు జరిగేవి. అటు ఆంజనేయులు భార్యపై అనుమానం పెంచుకున్నాడు. దీంతో సోమవారం రాత్రి నిద్రిస్తున్న భార్యను రోకలి బండతో కొట్టి చంపి పారిపోయాడు. ‘నా జీవితంలో సగభాగమైన నిన్ను నా చేతులారా నేనే చంపుకున్నా’ అని వాట్సాప్ స్టేటస్ పెట్టాడు.
News January 21, 2026
NRPT: కరెంట్ షాక్‌తో రైతు మృతి

దామరగిద్ద మండలం బాపన్‌పల్లి గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన నారాయణ పొలం పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఎప్పటిలాగే బుధవారం రోజు పొలానికి వెళ్లాడు. నాట్లు వేసే క్రమంలో వరి పొలంలో అంచులు చేస్తుండగా విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


