News September 12, 2025

వరంగల్ నగరంలో అర్ధరాత్రి లాడ్జిల్లో పోలీసుల తనిఖీ

image

వరంగల్ నగరంలో నేరాల నియంత్రణ, నేరస్థులను గుర్తించే లక్ష్యంతో మట్టెవాడ పోలీసులు అర్ధరాత్రి తమ పరిధిలోని వివిధ లాడ్జిలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా లాడ్జిలో బస చేసిన వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరించారు.
అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను పోలీసులు విచారించారు. ఈ రకమైన తనిఖీలు నేరాలను అరికట్టడానికి, శాంతిభద్రతలు కాపాడటానికి ఉపయోగపడతాయని పోలీసులు తెలిపారు.

Similar News

News December 17, 2025

డిసెంబర్ 17: చరిత్రలో ఈరోజు

image

* 1903: రైట్ సోదరులు తయారు చేసిన విమానం మొదటిసారి ఎగిరింది
* 1914: క్రికెట్ లెజెండ్ సయ్యద్ ముస్తాక్ అలీ జననం
* 1959: నటి జయసుధ జననం
* 1959: ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య మరణం
* 1985: నటుడు అడివి శేష్ జననం
* 1996: సినీ నటి సూర్యకాంతం మరణం(ఫొటోలో)

News December 17, 2025

SRCL: లక్ష్మీనరసింహస్వామికి అగ్గిపెట్టెలో ఇమిడే చీర అందజేత

image

సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతం సృష్టించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేకించి అగ్గిపెట్టెలో ఇమిడే రెండు గ్రాముల బంగారు చీరను మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఈవో వెంకటస్వామికి అందించారు. దీని పొడవు 5:30 మీటర్లు వెడల్పు 48 ఇంచులు దీనిని తయారు చేయుటకు వారం రోజుల వ్యవధి పట్టిందన్నారు. ఈ సందర్భంగా నల్ల విజయ్‌కు అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.

News December 17, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.