News March 14, 2025
వరంగల్: నగర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మేయర్

హోలీ పండుగ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ ఆప్యాయత సంతోషాల హరివిల్లుగా, శాంతి సౌభ్రాతృత్వానికి ప్రత్యేకంగా నిలిచే ఈ హోలీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. సహజ సిద్ధమైన రంగులతో సాంప్రదాయ పద్ధతులతో ఈ రంగుల పండుగను ఆనందంతో సంతోషంగా జరుపుకోవాలని మేయర్ ఆకాంక్షించారు.
Similar News
News February 18, 2026
ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం చేయాలి: WGL కలెక్టర్

ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 26 పరీక్షా కేంద్రాల్లో 12,166 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్ వంటి కనీస వసతుల్లో లోటు ఉండకూడదని స్పష్టం చేశారు.
News February 17, 2026
రీ-సర్వే వేగవంతం చేయాలి: కలెక్టర్

వరంగల్ జిల్లాలో నక్షలు లేని గ్రామాల్లో భూముల రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో రీ-సర్వే పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించారు. నక్షలు లేని గ్రామాల్లో భూసర్వే ఖచ్చితత్వంతో పూర్తి చేసి, భూ వివాదాలకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
News February 17, 2026
వరంగల్ జిల్లాలో 47.79% మ్యాపింగ్ పూర్తి: కలెక్టర్

వరంగల్, నర్సంపేట, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) మ్యాపింగ్ ప్రక్రియ 47.79 శాతం పూర్తయిందని కలెక్టర్ డా.సత్య శారద తెలిపారు. హైదరాబాద్ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వరంగల్ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ డా.సత్య శారద పాల్గొన్నారు.


