News October 7, 2025

వరంగల్: నిన్నటిలాగే పచ్చి పల్లికాయ ధర!

image

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో సోమవారంతో పోలిస్తే నేడు మక్కల ధర తగ్గగా, పల్లికాయ ధర పెరిగింది. క్వింటా మక్కలు(బిల్టీ) సోమవారం రూ.2,150 ధర పలికితే.. నేడు రూ.2,140 అయింది. అలాగే, సూక పల్లికాయకు నిన్న రూ.6,500 ధర వస్తే.. మంగళవారం రూ.6,610 వచ్చింది. పచ్చి పల్లికాయ నిన్నటిలాగే ఈరోజు కూడా రూ.4,710 ధర పలికినట్లు మార్కెట్ వ్యాపారులు తెలిపారు.

Similar News

News January 13, 2026

BREAKING: యాదాద్రి: అక్రమాలపై పోలీసులకు ఫిర్యాదు

image

భూరిజిస్ట్రేషన్ల ఛార్జీల చెల్లింపుల్లో అక్రమాలపై యాదగిరిగుట్ట, తుర్కపల్లి, బొమ్మలరామారం, వలిగొండ PSలలో తహశీల్దార్లు ఈరోజు ఫిర్యాదు చేశారు. తహశీల్దార్ల ఫిర్యాదు మేరకు 4 PSలల్లో ఇంటర్‌నెట్ సెంటర్ల నిర్వాహకులు, డాక్యుమెంట్ రైటర్లు 19 మందిపై కేసులు నమోదు చేశారు. వలిగొండ రూ.15 లక్షలు యాదగిరిగుట్ట రూ.72 లక్షలు, బొమ్మలరామారంలో రూ.25 లక్షలు, తుర్కపల్లిలో రూ.14 లక్షలు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారన్నారు.

News January 13, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ చైనా మాంజా వాడొద్దు: మణుగూరు DSP
✓ చుంచుపల్లి: పాఠశాల వద్ద హైటెన్షన్ ముప్పు
✓ సుజాతనగర్: ట్రాఫిక్ నియమాలు పాటించాలి: ఎస్పీ
✓ అశ్వారావుపేటలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన
✓ ఈనెల 16, 17న పాల్వంచ పెద్దమ్మ గుడిలో ప్రత్యేక పూజలు
✓ దుమ్ముగూడెం: హెల్త్ సెంటర్లను తనిఖీ చేసిన DMHO
✓ కొత్తగూడెం: లిక్విడ్ గంజాయి తరలిస్తున్న వ్యక్తులు అరెస్ట్
✓ దుమ్ముగూడెం: విద్యుత్ షాక్‌తో వర్కర్‌కు గాయాలు

News January 13, 2026

NGKL: బాధ్యతగా ట్రాఫిక్ నియమాలు పాటించాలి: ఎస్పీ

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని రోడ్డు నిబంధనలను భయం కోసం కాకుండా బాధ్యతతో పాటించాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ సూచించారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేగం కన్నా ప్రాణం ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ తమ కుటుంబాలకు భద్రతగా ఉండాలని కోరారు.