News October 7, 2025

వరంగల్: నిర్దేశించిన సమయంలో షాపుల మూసివేత

image

శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేరాలు, చోరీల నియంత్రణకై వరంగల్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కమిషనరేట్ పరిధిలో నిర్దేశించిన సమయంలోనే దుకాణాలను మూయించేందుకు పోలీస్ అధికారులు పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. సీపీ ఆదేశాలతో దుకాణాలను సమయానికి మూయించేస్తున్నారు.

Similar News

News January 21, 2026

నెల్లూరు: PACSలో ఇక ఆన్‌లైన్ సేవలు

image

నెల్లూరు జిల్లాలోని 76 PACSలకు గాను 71 సంఘాల్లో పూర్తిస్థాయి కంప్యూటీకరణ చేశామని జిల్లా సహకార శాఖ అధికారి గుర్రప్ప వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్ ప్రక్రియపై సీఈవోలకు రెండు రోజుల శిక్షణ ఇచ్చామని చెప్పారు. ఇకపై PACS సంఘాల్లో ఆన్‌లైన్ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మాన్యువల్ పద్ధతి ఉండదన్నారు.

News January 21, 2026

సంగారెడ్డి: నేడు సదరం శిబిరం

image

సంగారెడ్డిలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో బుధవారం ఉదయం 10 గంటలకు సదరం శిబిరం నిర్వహిస్తున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఆన్ లైన్‌లో ఫ్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులు మాత్రమే సదరం శిబిరానికి హాజరు కావాలని చెప్పారు. చరవాణికి వచ్చిన సందేశంతో శిబిరానికి హాజరుకావాలని పేర్కొన్నారు.

News January 21, 2026

రాష్ట్రంలో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ పార్క్!

image

ఇజ్రాయెల్ ఆర్థిక, పరిశ్రమల మంత్రి నిర్ బర్కత్, ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్‌తో దావోస్‌లో CM చంద్రబాబు భేటీ అయ్యారు. ‘రక్షణ, ఏరోస్పేస్, UAV పర్యావరణ వ్యవస్థలు, డీశాలినేషన్, సెమీకండక్టర్, క్వాంటం లీడర్‌షిప్, వైద్యం, విద్య, సైబర్ సెక్యూరిటీలో అవకాశాలపై చర్చించాం. మెడ్-టెక్, ఏరో-డిఫెన్స్, క్లీన్-టెక్ కంపెనీలకు ఆతిథ్యమివ్వడానికి రాష్ట్రంలో ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని ప్రతిపాదించాను’ అని ట్వీట్ చేశారు.