News September 13, 2025

వరంగల్: నేడే జాతీయ లోక్ అదాలత్..!

image

జాతీయ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం నిర్వ హించనున్న జాతీయ లోక్అదాలత్‌ను వినియోగించుకోవాలని వరగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్ పాండే తెలిపారు. జాతీయ లోక్ అదాలత్‌ను పురస్కరించుకొని వరంగల్, హనుమకొండతో పాటు ఆయా జిల్లాల పరిధిలోని నర్సంపేట, పరకాల కోర్టుల్లో సైతం బెంచీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 14, 2025

రాజోలి: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

రాజోలి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో లెక్కింపు ప్రక్రియను ఆదివారం కలెక్టర్ సంతోష్, ఎస్పీ శ్రీనివాసరావు పరిశీలించారు. కౌంటింగ్‌లో పారదర్శకత, కచ్చితత్వం అత్యంత ముఖ్యమని కలెక్టర్ అన్నారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించి, తరువాత వార్డ్ మెంబర్ బ్యాలెట్ పేపర్లను వేరుచేసి క్రమపద్ధతిలో ఓట్లను లెక్కించాలని అధికారులను ఆదేశించారు.

News December 14, 2025

GNT: వరుసగా మూడోసారి మన జిల్లా టాప్

image

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొత్తం 431 లోక్ అదాలత్ బెంచ్‌లను ఏర్పాటు చేసి 3,04,212 కేసులను పరిష్కరించామని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ తెలిపారు. ఇందులో 5,985 సివిల్, 2,75,567 క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాగా సివిల్ కేసుల పరిష్కారంలో 23,466 కేసులతో గుంటూరు జిల్లా వరుసగా మూడోసారి ప్రథమ స్థానంలో నిలిచింది.

News December 14, 2025

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్

image

బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన బిహార్ మంత్రిగా ఉన్నారు. అటు UP BJP అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి స్థానంలో పంకజ్ చౌదరి బాధ్యతలు స్వీకరించారు. ఈయన 7 సార్లు ఎంపీగా గెలిచారు.