News October 7, 2025

వరంగల్ పరిధిలో 23 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదు

image

వరంగల్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 23 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. సోమవారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ 22 మందితో పాటు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ఒకరు పట్టుబడినట్లు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సుజాత తెలిపారు. వీరందరికీ కోర్టు జరిమానా విధించిందన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News January 22, 2026

గద్వాల్: మనస్తాపంతో యువకుడి సూసైడ్

image

అయిజ మండలం బోయపేట కాలనీ వెంకటేష్ ఒంటరితనం భరించలేక ఇంట్లో ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. కాలనీవాసుల కథనం ప్రకారం.. రంగన్న, లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు ఉండగా పెద్ద కుమారుడికి వివాహం చేశారు. అతడు వేరుగా పడగా వెంకటేష్ తల్లిదండ్రుల వద్ద ఉంటున్నాడు. గతేడాది వారు అనారోగ్యంతో మృతి చెందారు. ఏడాదిగా ఒంటరితనం భరించలేక వెంకటేష్ సూసైడ్ చేసుకున్నాడు. కాలనీవాసులు అతడి అంత్యక్రియల నిర్వహించారు.

News January 22, 2026

అతడు ఆడకపోతే కష్టమే.. సూర్య ఫామ్‌పై రోహిత్ ఆందోళన

image

T20 WC దగ్గరపడుతున్న వేళ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ లేమిపై రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. అతను సరిగా ఆడకపోతే ఆ ప్రభావం మొత్తం బ్యాటింగ్‌ లైనప్‌పై పడుతుందన్నారు. ఇది SKYకి ఒక్కడికే వర్తించదని.. ఏ ప్లేయర్ ఫామ్‌లో లేకపోయినా దాని ప్రభావం టీమ్‌పై ఉంటుందన్నారు. సూర్యకు ఆటపైనా, ప్లేయర్లపైనా, వారి నుంచి బెస్ట్ రాబట్టుకోవడంపైనా మంచి అవగాహన ఉంటుందంటూ అతడి లీడర్‌షిప్ స్కిల్స్‌ను ప్రశంసించారు.

News January 22, 2026

క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాలి: కలెక్టర్

image

సంక్షేమ వసతి గృహాలలో మెరుగైన వసతుల కల్పనే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. గురువారం కర్నూలు కలెక్టరేట్ నుంచి అంగన్వాడీ కేంద్రాలు, ఇరిగేషన్ అంశాలకు సంబంధించి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్‌పై సంబంధిత శాఖల జిల్లా అధికారులలో కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఎప్పటికప్పుడు వసతి గృహాలను తనిఖీ చేయాలన్నారు.