News October 7, 2025
వరంగల్: పుల్లలు ఏరుకొని సంపాదిస్తున్నారు..!

తెలివుంటే కట్టె పుల్లలు ఏరుకొని కూడా బతకవచ్చని నిరూపిస్తున్నారు కోల్‌కత్తా నుంచి నర్సంపేటకు వచ్చిన యువకులు. వీరు రోడ్డుకు ఇరువైపులా పెరిగే దుల్షన్ చెట్టు పనిలో పడ్డారు. కొమ్మలు చెరిగి పుల్లలు పోగుచేస్తున్నారు. బెరడును వేరు చేసి, మూట కట్టి ట్రైన్లో కలకత్తాకు ఎగుమతి చేస్తున్నారు. షూ పాలిష్, రంగుల తయారీలో ఈ బెరడు వాడతారని, అక్కడ కిలోకు రూ.200 ఉంటుందని చెబుతున్నారు. నెలకు తలో రూ.20 వేలు మిగులుతాయట.
Similar News
News January 23, 2026
కడప జిల్లాలో VRO సస్పెండ్.!

చెన్నూరు మండలం రామనపల్లి<<18926711>> VRO<<>> వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వేణు గోపాల్‌పై అందిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా VROను సస్పెండ్ చేస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.
News January 23, 2026
KNR: స్థానిక సంస్థల నుంచే ఉన్నత శిఖరాలకు..

ఉమ్మడి KNR జిల్లా నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్లుగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పలువురు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారు. బండి సంజయ్, గంగుల కమలాకర్, రామగుండం మాజీ MLAలు సోమారపు సత్యనారయణ, కోరుకంటి చందర్, KNR మాజీ MLAలు చల్మెడ ఆనందరావు, జువ్వాడి చంద్రశేఖర్‌రావు, ఇందుర్తి మాజీ MLA బొమ్మ వెంకటేశ్వర్లు, మాజీ MLCలు సంతోష్ కుమార్, గోపాల్ రావు తదితరులు కార్పొరేటర్ల నుంచే తమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు.
News January 23, 2026
నేటి నుంచి తిరుపతిలో టోకెన్ల్ బంద్

తిరుమలలో ఈనెల 25న రథసప్తమి వేడుకలు చేయనున్నారు. ఈక్రమంలో మూడురోజులు సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ నిలిపివేయనుంది. తిరుపతిలోని మూడు కేంద్రాల్లో ఈనెల 23, 24, 25వ తేదీల్లో ఈ టికెట్లు జారీ చేయరు. తిరిగి 26వ తేదీన మరుసటి రోజు దర్శనానికి సంబంధించి టోకెన్లను ఇస్తారు. ఈ మేరకు ఆయా టోకెన్ల జారీ కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశారు.


