News October 8, 2025

వరంగల్: పెరిగిన కొత్త పత్తి, తగ్గిన పాత పత్తి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గత రెండు రోజులతో పోలిస్తే కొత్త పత్తి ధర పెరగగా, పాత పత్తి ధర తగ్గింది. సోమవారం, మంగళవారం క్వింటా కొత్త పత్తి ధర రూ.7,100 ధర పలకగా.. నేడు రూ.7,191 పలికిందని అధికారులు తెలిపారు. అలాగే, పాత పత్తి క్వింటాకు సోమవారం రూ.7,350, మంగళవారం రూ.7,320 ధర రాగా.. నేడు(బుధవారం) రూ.7,300కి తగ్గిందని పేర్కొన్నారు.

Similar News

News January 15, 2026

విశాఖలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో నగరంలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ కార్యాలయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ విశాఖలో నిరంతర నిఘా కొనసాగించారు. గంజాయి వంటి మత్తుపదార్థాలు రవాణా కాకుండా ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

News January 15, 2026

మురిపించిన వేళ్ల విన్యాసం.. పరవశించిన ముంగిళ్లు

image

కామారెడ్డి జిల్లావ్యాప్తంగా సంక్రాంతి పండుగ వేడుకలు సంబరంగా జరిగాయి. జిల్లాలోని ప్రతి ఇల్లూ కొత్త అల్లుళ్లు, బంధువుల రాకతో కళకళలాడింది. ముగ్గుల పోటీలు, సంప్రదాయ అలంకరణలు ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యువతులు, చిన్నారులు తమ వేళ్ల విన్యాసంతో ముంగిళ్లను మురిపించారు. ప్రతి ఇంట్లో పిండివంటల ఘుమఘుమలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గారెలమ్మలు, అరిసెలు, సకినాల వాసనలతో వాడలన్నీ నిండిపోయాయి.

News January 15, 2026

కొత్తకొండ జాతరకు కొత్తపల్లి ఎడ్ల రథాలు!

image

భీమదేవరపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామం నుంచి గత 60 ఏళ్లుగా కొత్తకొండ జాతరకు రథాలు బయల్దేరడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి ఏడాది సుమారు 80 ఎడ్ల బండ్లతో రథయాత్ర సాగుతుంది. కొత్తపల్లి నుంచి కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయానికి చేరుకుని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోతాయి. ఈ సంప్రదాయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.