News November 30, 2025

వరంగల్: పేరుకే వేర్వేరు గ్రామాలు..!

image

సాధారణంగా ఒక గ్రామానికి మరో గ్రామానికి మధ్య కొంచెం దూరం ఉంటుంది. కానీ, ఇక్కడ గ్రామాలు వేరే అయినా ఆ గ్రామాలు కలిసే ఉంటాయి. ఇలాంటి విచిత్ర పరిస్థితి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో నెలకొంది. తురకల సోమారం-జమల్‌పురం రెండు గ్రామాలు ఒకే చోట కలిసి ఉంటాయి. అచ్చం ఇలాగే నారాయణపురం-రోళ్లకల్లు గ్రామాలు సైతం కలిసే ఉంటాయి. గ్రామాలు ఒకే చోట ఉన్నా గ్రామ పంచాయతీలు మాత్రం వేర్వేరు కావడం విశేషం.

Similar News

News February 19, 2026

మదనపల్లె మృగాడికి మరణం తర్వాతా శిక్ష

image

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ఆత్మహత్య చేసుకున్న కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు కుటుంబం నిరాకరించింది. నిన్న పోస్టుమార్టం రిపోర్టుపై సంతకానికి సైతం రాకపోవడంతో అతడి పెదనాన్న సమ్మతితో ప్రక్రియ పూర్తి చేశారు. ఇప్పుడు బాడీ కోసం ఎవరూ రాకపోవడంతో అనాథ శవంగా మున్సిపాలిటీ సిబ్బంది ఖననం చేయనున్నారు. కాగా 7సం.ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ కులవర్ధన్, శిక్ష భయంతో చెరువులో దూకి చనిపోయాడు.

News February 19, 2026

తూ.గో: దారుణం.. భార్యను కిరాతకంగా చంపిన భర్త

image

బిక్కవోలు మండలం రంగాపురంలో బుధవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. దొనకొండ జ్యోతి(28)ని ఆమె భర్త దుర్గయ్య దాడి చేసి చంపాడని స్థానికులు తెలిపారు. గత ఐదేళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలే ఇందుకు కారణమని తెలుస్తోంది. జ్యోతి మృతి చెందిన అనంతరం దుర్గయ్య పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News February 19, 2026

చిన్న వయసులోనే తల నెరుస్తోందా?

image

చర్మంలో మెలనిన్‌ ఉత్పత్తి తగ్గినప్పుడు తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. ఇది వృద్ధాప్యచిహ్నం. కానీ ప్రస్తుతం చాలామందికి చిన్నవయసులోనే తల నెరుస్తోంది. హార్మోనుల్లో అసమతుల్యత, అనారోగ్యకర జీవన శైలి, కాలుష్యం, రసాయనాలున్న, సింథటిక్‌ షాంపూలు వాడటం దీనికి కారణం అంటున్నారు నిపుణులు. గోధుమ, పెరుగు, టొమాటో, అరటి, చిరుధాన్యాలు, గుడ్డు, చేప, సీఫుడ్‌, సోయాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.