News September 10, 2025
వరంగల్: ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే లింకులపై క్లిక్ చేయద్దు!

ప్రభుత్వ పథకాల పేరిట వచ్చే లింకులపై క్లిక్ చేస్తే ఖాతాలోని సొమ్ము ఖాళీ అవుతుందని వరంగల్ సైబర్ పోలీసులు ప్రజలకు సూచించారు. వాట్సాప్, టెలిగ్రామ్‌లో వచ్చే ప్రకటనల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా ఉచితంగా లోన్లు వస్తాయంటూ వచ్చే ప్రకటలతో భద్రని హెచ్చరించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవద్దని, ప్రభుత్వ పథకాల కోసం అధికారిక వెబ్ సైట్లను అశ్రాయించాలన్నారు.
Similar News
News December 6, 2025
భారత్‌లో మరో రష్యన్ న్యూక్లియర్ ప్లాంట్!

రష్యా తయారుచేసిన రియాక్టర్లతో భారత్‌లో రెండో అణు విద్యుత్ ప్లాంట్ నిర్మించే అవకాశాలపై చర్చించినట్టు రెండు దేశాలు ప్రకటించాయి. ఈ ప్రాజెక్టుకు స్థలాన్ని కేటాయించేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపాయి. ప్రైవేట్ న్యూక్లియర్ ఆపరేటర్లకు అవకాశం ఇచ్చే సంస్కరణలపై చర్చలు జరుగుతున్న సమయంలో ఈ ఒప్పందాలు జరిగాయి. ఇప్పటికే తమిళనాడు కూడంకుళంలో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన 2 రష్యన్ VVERలను భారత్ నిర్వహిస్తోంది.
News December 6, 2025
471 పంచాయతీలు.. 3 విడతల్లో ఎన్నికలు

నేటితో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 22 మండలాల్లోని 471 గ్రామపంచాయతీల నుంచి సర్పంచ్, 4168 వార్డు సభ్యులకు కోసం నామినేషన్లు స్వీకరించారు. మొదటి విడతలో 8 మండలాలకు 11న, 2వ విడతలో 7 మండలాలకు 14న, 3వ విడతలో 7 మండలాలకు 17న ఎన్నికలు జరగనున్నాయి. 4242 పోలింగ్ స్టేషన్లలో ఎన్నికలకు ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ప్రకటించారు.
News December 6, 2025
ఎర్రవల్లి: వచ్చేది మన ప్రభుత్వమే: కేసీఆర్

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎర్రవల్లి, నర్సన్నపేట సర్పంచి అభ్యర్థులు ఆయన్ను కలిశారు. వచ్చేది మన ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని, కొన్ని కష్టాలు వచ్చినా బెదరకూడదని అన్నారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎవరో ఏదో చేస్తారని ఆగం కావొద్దని సూచించారు.


