News August 11, 2025
వరంగల్: ప్రారంభమైన మార్కెట్.. పడిపోయిన పత్తి ధర

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్‌కు పత్తి తరలివచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే గతవారంతో పోలిస్తే నేడు పత్తి ధర తగ్గింది. గత వారం గరిష్ఠంగా క్వింటా రూ.7,720 ధర పలకగా.. సోమవారం రూ.7,620కి పడిపోయింది. మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతున్నాయి.
Similar News
News March 9, 2026
HYD స్టేడియాలకు మహర్దశ.. లిస్టులో ఇవే!

నగరంలోని వివిధ ప్రాంతాల స్టేడియాలకు మహర్దశ పట్టనుంది. సరూర్‌నగర్ స్టేడియం, ఎల్బీ స్టేడియం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, లాల్ బహుదూర్ శాస్త్రి స్టేడియాలను ఆధునికరించాలని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయా సంబంధిత శాఖకు నేడు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే ప్రణాళికలు రచించి వేసవిలో పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
News March 9, 2026
అనకాపల్లి జిల్లాలో TODAY TOP NEWS

➤ మాకవరపాలెంలో పరిశ్రమలు ఏర్పాటుకు 4259 ఎకరాల భూమి సేకరణకు స్థల పరిశీలన
➤ గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష
➤ బాలుడి మృతికి నాటు తుపాకీ పేలుడే కారణం
➤ అక్రమ ఆయుధాలు కలిగి ఉంటే కఠిన చర్యలు: ఎస్పీ
➤ పుత్తడి గైరంపేటలో గుండెపోటుతో యువకుడు మృతి
➤ శృంగవరంలో పర్యటించిన కేంద్ర బృందం
➤ ఎరకన్నపాలెం టూ పెద్దపల్లి రోడ్డు నిర్మాణానికి రూ.15 కోట్లతో ప్రతిపాదనలు
➤PGRS లో ఫిర్యాదుల వెల్లువ