News April 11, 2025

వరంగల్: భారీ ధర పలికిన పత్తి

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో గత వారం రోజులుగా పత్తి ధరలు రైతన్నలకు భారీ ఊరటనిస్తున్నాయి. గత నాలుగు నెలలుగా ఎన్నడూ లేని విధంగా ఈరోజు పత్తి రికార్డు ధర పలికింది. ఈరోజు క్వింటా పత్తికి రూ.7,500 ధర వచ్చింది. ఈవారం మొదటి నుంచి ధరలు చూస్తే.. సోమవారం రూ.7,405, మంగళవారం రూ.7,355, బుధవారం రూ.7,400, గురువారం రూ.7425 ధర పలికాయి.

Similar News

News January 17, 2026

గొల్లప్రోలులో కోర్టు సినిమా హీరోయిన్ సందడి

image

గొల్లప్రోలు మండలం తాటిపర్తిలోని ప్రసిద్ధ అపర్ణాదేవి ఆలయాన్ని శనివారం కోర్టు సినిమా ఫేమ్ శ్రీదేవి సందర్శించారు. ఆలయ ప్రధానార్చకుడు ఆకొండి ప్రభాకర్ శాస్త్రి ఆధ్వర్యంలో అమ్మవారికి ఆమె కుంకుమ పూజలు చేశారు. పండితులు వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు హీరోయిన్‌ను ఘనంగా సత్కరించారు. శ్రీదేవి రాకతో ఆలయ ప్రాంగణంలో సందడి నెలకొంది.

News January 17, 2026

నా భర్తను క్షమించను: నటుడు గోవిందా భార్య

image

నటుడు గోవిందాపై భార్య సునీత సంచలన కామెంట్లు చేశారు. జీవితంలోకి ఎందరో అమ్మాయిలు వస్తూ వెళ్తుంటారని, మనమే బాధ్యతగా ఉండాలని భర్తకు సూచించారు. తన భర్తను ఎప్పటికీ క్షమించనని అన్నారు. ‘మీకు 63ఏళ్లు వచ్చాయి. మన అమ్మాయి టీనాకు పెళ్లి చేయాలి. కొడుకు యశ్‌ కెరీర్‌పై ఫోకస్ పెట్టాలి. నేను నేపాల్‌ బిడ్డను. కత్తి తీశానంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇకనైనా జాగ్రత్తగా ఉండమని అతనికి చెప్తుంటా’ అని పేర్కొన్నారు.

News January 17, 2026

ఇతిహాసాలు క్విజ్ – 126 సమాధానం

image

ఈరోజు ప్రశ్న: రావణుడి చివరి శ్వాసలో లక్ష్మణుడు ఆయన దగ్గరకు వెళ్లి ఏం నేర్చుకున్నాడు?
సమాధానం: రావణుడి దగ్గర నుంచి లక్ష్మణుడు రాజనీతి నేర్చుకున్నాడు. రావణుడు ‘మంచి పనిని ఆలస్యం చేయక వెంటనే చేయాలి. శత్రువును తక్కువ అంచనా వేయకూడదు. తన మరణ రహస్యం విభీషణుడికి చెప్పడం వల్లే తాను ప్రాణాలు కోల్పోతున్నానని, కాబట్టి ప్రాణ స్నేహితుడికైనా ముఖ్య రహస్యాలు ను ఎప్పుడూ చెప్పకూడదు’ అని వివరించాడు. <<-se>>#Ithihasaluquiz<<>>