News September 13, 2025

వరంగల్: మత్తు పదార్థాలపై కఠిన చర్యలు

image

గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల విక్రయం, రవాణా లేదా నిల్వపై విశ్వసనీయ సమాచారం అందించాలని వరంగల్ పోలీసులు ప్రజలకు పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలు అమ్మే ప్రదేశాలు, అమ్మకందారులు లేదా తరలింపులో ఉపయోగించే వాహనాలపై ఎవరైనా సమాచారం కలిగి ఉంటే వెంటనే తెలియజేయాలని కోరారు. దీనికోసం టోల్‌ఫ్రీ నంబర్‌ 1908 లేదా 87126 71111 ద్వారా అందించవచ్చు అన్నారు.

Similar News

News December 12, 2025

ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అసంతృప్తి

image

TG: డ్యామ్‌ల భద్రతపై సమగ్ర నివేదిక ఇవ్వక‌పోవడం పట్ల ఇరిగేషన్ అధికారులపై NDSA ఛైర్మన్ అనిల్ జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదేశాలను బేఖాతరు చేయడంపై వారిని నిలదీశారు. 174 డ్యామ్‌ల భద్రతపై 3 నెలల్లోగా నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. నివేదికలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలన్నారు. డ్యాముల ప్రస్తుత స్థితి, O&M MANUAL, డ్యామ్ దెబ్బతిన్న సందర్భంలో అత్యవసర ప్రణాళికలు ఈ నివేదికలో ఉండాలన్నారు.

News December 12, 2025

సిద్దిపేట: యూకే హౌస్ ఆఫ్ లార్డ్స్‌ సభ్యుడిగా శనిగరం వాసి

image

సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజుకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన యునైటెడ్ కింగ్‌డమ్ హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఎంపికయ్యారు. ప్రధానమంత్రి సిఫారసు మేరకు ఇంగ్లాండ్ రాజు ఈ నామినేషన్ చేశారు. గతంలో లేబర్ పార్టీ అభ్యర్థిగా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన నాగరాజు.. శనిగరానికి చెందిన హనుమంతరావు, నిర్మల దేవి దంపతుల కుమారుడు.

News December 12, 2025

రంగారెడ్డి జిల్లా: 7 మండలాల్లో కాంగ్రెస్ vs BRS

image

రంగారెడ్డి జిల్లాలో 1stవిడత సర్పంచ్ ఎలక్షన్స్‌లో BRS, కాంగ్రెస్ పోటీ పడ్డాయి.
☛ శంషాబాద్‌: 21 GPలకు కాంగ్రెస్ 12, BRS 3, BJP 2
☛ ఫరూక్‌నగర్: 47GPలకు కాంగ్రెస్ 28, BRS 18
☛ చౌదరిగూడ: 24GPలకు, కాంగ్రెస్ 13, BRS 11
☛ కేశంపేట్: 29లకు, కాంగ్రెస్ 15, BRS 13
☛ కొందుర్గు: 22GPలకు, కాంగ్రెస్ 13, BRS8, BJP 1
☛ నందిగామ: 19GPలకు కాంగ్రెస్ 6, BRS 12
☛ కొత్తూరు: 12GPలకు, కాంగ్రెస్ 9, BRS 3 సర్పంచ్‌లు గెలిచాయి.