News September 25, 2024
వరంగల్ మార్కెట్‌లో మిర్చి ధరల వివరాలు..
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. 341 రకం మిర్చి నిన్న క్వింటా మిర్చి రూ.16,000 ఉండగా నేడు రూ.16,500 ధర పలికింది. అలాగే తేజ మిర్చి నిన్న రూ.18,800 ధర పలకగా నేడు రూ. 18,400 ధర వచ్చింది. మరోవైపు వండర్ హాట్(WH) మిర్చికి నిన్నటిలాగే నేడు రూ.16 వేలు వచ్చింది. టమాటా మిర్చికి సైతం నిన్నటిలాగే రూ.25 వేల ధర పలికిందని వ్యాపారులు తెలిపారు.
Similar News
News October 12, 2024
వరంగల్: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి?
దసరా పండుగ అనగానే పల్లె యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, దోస్తులను కలిసి ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రతి ఊరిలో దసరా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. పలు చోట్ల విభిన్నంగానూ చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
News October 12, 2024
హనుమకొండ: జిల్లా ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
విజయానికి చిహ్నమైన విజయదశమిని జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. జిల్లా ప్రజలకు కలెక్టర్ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ దసరా పండుగ రోజున ప్రజలందరూ ఒకరినొకరు కలుసుకొని సుఖసంతోషాలతో శమీ పూజ నిర్వహించి ఐకమత్యంగా పండుగను జరుపుకోవాలన్నారు. సుఖసంతోషాలతో ఉండేలా ఆ దుర్గాదేవి అందరిని ఆశీర్వదించాలని ఆకాంక్షించారు.
News October 11, 2024
హనుమకొండ: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి: స్టేట్ హెల్త్ డైరెక్టర్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, అందు కోసం డాక్టర్లు, సిబ్బంది నిబద్ధతో పని చేయాలని రాష్ర్ట ఆరోగ్యశాఖ సంచాలకులు (డైరెక్టర్) బి.రవీందర్ నాయక్ పేర్కొన్నారు. ఈరోజు హనుమకొండ జిల్లాలోని పోచమ్మకుంట పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలు గురించి ఆరా తీశారు. ఆసుపత్రి పరిధిలో నమోదైన డెంగ్యూ, మలేరియా ఇతర వ్యాధుల గురించి తెలుసుకున్నారు.