News December 2, 2025
వరంగల్ మార్కెట్‌లో స్థిరంగా పత్తి ధర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఈరోజు సైతం పత్తి ధర రూ.7 వేల మార్క్ దాటింది. సోమవారం క్వింటా పత్తి ధర గరిష్ఠంగా రూ.7,100 పలకగా.. మంగళవారం కూడా ఇదే ధర పలికినట్లు అధికారులు పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో పత్తికి ఉన్న డిమాండ్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
Similar News
News February 12, 2026
కామారెడ్డి జిల్లాలో తగ్గని చలి తీవ్రత

కామారెడ్డి జిల్లాలో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. గడచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. గాంధారి మండలం రామ్‌లక్ష్మణ్‌పల్లిలో అత్యల్పంగా 13.8 డిగ్రీలు నమోదు కాగా, గాంధారిలో 14.1, లచ్చపేటలో 14.3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జుక్కల్, పెద్ద కొడపగల్‌లో 14.7, మద్నూర్‌లో 14.8 డిగ్రీలుగా రికార్డయ్యాయి. ఉదయం వేళ దట్టమైన పొగమంచు కురుస్తుండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News February 12, 2026
కామారెడ్డి: వేములవాడకు ప్రత్యేక బస్సులు

మహాశివరాత్రి ఉత్సవాలకు వెళ్లే భక్తుల కోసం కామారెడ్డి డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ దినేశ్ తెలిపారు. ఈనెల 13 నుంచి 16 వరకు కామారెడ్డి నుంచి వేములవాడ రాజన్న క్షేత్రానికి నిరంతరం బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే రామారెడ్డి మండలం మద్దికుంటలోని బుగ్గ రామలింగేశ్వర ఆలయానికి కూడా ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేశామని, భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
News February 12, 2026
VZM: తొక్కిసలాట జరగకుండా ఏర్పాట్లు

శివరాత్రికి రామతీర్థం, పుణ్యగిరి, ధర్మవరం, సంగమేశ్వర స్వామి ఆలయం, పాల్తేరు, కోటిపల్లి, తదితర శివాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. ఉచిత బస్సు పథకం వల్ల మహిళలు గతం కంటే ఎక్కువగా వచ్చే అవకాశం ఉందన్నారు. తొక్కిసలాట జరగకుండా అన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రవేట్ ఆలయాలకు సంబంధించి ఆలయ కమిటీలను అప్రమత్తం చేయాలన్నారు.


