News September 13, 2025
వరంగల్: మావోయిస్టు బాలకృష్ణ అంత్యక్రియలపై మీమాంస..!

హనుమకొండ జిల్లా మడికొండ గ్రామానికి చెందిన మావోయిస్టు మోడెం బాలకృష్ణ అంత్యక్రియలపై మీమాంస నెలకొంది. స్వగ్రామం మడికొండ కాగా.. హైదరాబాదులో సైతం వారు ఉండటంతో బాలకృష్ణ అంత్యక్రియలు ఎక్కడ జరుగుతాయని ఆలోచిస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితమే హైదరాబాదులో స్థిరపడగా ఇప్పటివరకు మడికొండలో ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో అక్కడే బాలకృష్ణ అంత్యక్రియలు జరుగుతాయని చర్చించుకుంటున్నారు.
Similar News
News December 16, 2025
ఎన్టీఆర్: కొత్త పోలీస్ కానిస్టేబుళ్లకు కమిషనర్ దినిర్దేశం

ఎన్టీఆర్ జిల్లాకు ఎంపికైన 242 మంది కొత్త పోలీస్ కానిస్టేబుళ్లకు (172 పురుషులు, 70 మహిళలు) 9 నెలల శిక్షణపై నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 22 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని, 16న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు. శిక్షణలో శారీరక దృఢత్వం, టెక్నాలజీ, సైబర్ నేరాలపై అవగాహనతో పాటు ప్రజలతో సానుభూతిగా వ్యవహరించాలని సూచించారు.
News December 16, 2025
పల్నాడు విద్యార్థులకు రూ. 18.36 లక్షల రవాణా భత్యం

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థుల రవాణా సౌలభ్యం కోసం ప్రభుత్వం తొలి విడతగా 612 మంది విద్యార్థులకు రూ. 18.36 లక్షల రవాణా భత్యాన్ని విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అయ్యాయి. గ్రామీణ ప్రాంత విద్యార్థుల నిరంతర విద్యకు ఈ పథకం ఎంతగానో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
News December 16, 2025
కరీంనగర్: పల్లె పిలుస్తోంది.. ప్రగతి కోరుతోంది..!

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికల కోలాహలం తుది దశకు చేరుకుంది. బుధవారం ఉ. 7 గంటల నుంచి మ. ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుండగా, మ. 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. గ్రామాల అభివృద్ధి జరగాలంటే విద్యావంతులైన యువత భాగస్వామ్యం అవసరం. ఉద్యోగ, ఉపాధి రీత్యా పట్టణాల్లో స్థిరపడిన యువత ఈ ఒక్కరోజు సొంతూళ్లకు వచ్చి ఓటు వేయాలని గ్రామపెద్దలు కోరుతున్నారు.


