News September 13, 2025
వరంగల్ మీదుగా వెళ్లే వందే భారత్ రాకపోకల్లో స్వల్ప మార్పులు

వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకల్లో స్వల్ప మార్పులు చేశారు. సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య వరంగల్ మీదుగా ప్రస్తుతం గురువారం మినహా మిగతా ఆరు రోజులు నడుస్తున్న ఈ రైళ్లు డిసెంబర్ 5 నుంచి గురువారానికి బదులుగా సోమవారం ట్రిప్పులను రద్దు చేశారు. ఇకనుంచి సోమవారం మినహా మిగిలిన ఆరు రోజులు రాకపోకలు సాగిస్తాయని దక్షిణమధ్య రైల్వే ముఖ్య పౌరసంబంధాల అధికారి ఎ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Similar News
News December 15, 2025
WGL: ఆదివారం కావడంతో తరలివచ్చిన ఓటర్లు

రెండో విడత జీపీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. మొత్తం 564 జీపీలకు గాను 56 జీపీల్లో సర్పంచులు, 917 వార్డులు ఏకగ్రీవం కావడంతో 508 జీపీలకు, 4,020 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు.ఆదివారం సెలవు దినం కావడంతో 80 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 7,33,323 మంది ఓటర్ల కోసం 4,638 పీఎస్‌లు, 5,686 పీవోలు, 8,191 ఓపీఓలు, 5,500 మంది పోలీసులు పాల్గొన్నారు.
News December 15, 2025
ఎయిమ్స్ కల్యాణిలో 172 పోస్టులు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

పశ్చిమ బెంగాల్‌లోని <
News December 15, 2025
2 రోజులు స్కూళ్లకు సెలవు

TG: రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ఎల్లుండి జరగనున్నాయి. 4,158 సర్పంచ్, 36,434 వార్డు స్థానాలకు నోటిఫికేషన్ వెలువడగా 394 సర్పంచ్, 7,916 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటైన స్కూళ్లకు రేపు, ఎల్లుండి సెలవులు ఉండనున్నాయి. అలాగే ఓటు వేసేందుకు వీలుగా ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు ఉంటుంది.


