News August 12, 2025

వరంగల్: మెగా జాబ్ మేళా వేదిక మార్పు

image

వరంగల్, హన్మకొండ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా వేదిక మార్చానట్లు నిర్వహకులు తెలిపారు. ముందుగా రాధాకృష్ణ గార్డెన్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించినప్పటికీ.. పార్కింగ్ సమస్యల వలన పోచమ్మ మైదాన్‌లోని అబ్నుస్ ఫంక్షన్ హాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగులు గమనించి 12న మంగళవారం ఉదయం 10గంటల నుంచి జాబ్ మేళాను రావాలని తెలిపారు.

Similar News

News March 13, 2026

‘రామాయణంలో పిడకల వేట’ అంటే?

image

ముఖ్య విషయాన్ని వదిలేసి పనికిరాని వాటి గురించి మాట్లాడే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. పండితులు రామాయణం చెబుతుండగా ఓ మహిళ ఇంటి దగ్గర పిడకలు ఏమయ్యాయోనని మధ్యలో అనడంతో ‘రామాయణంలో పిడకల వేట’ వాడుకలోకి వచ్చింది. అలాగే రామాయణంలో ‘త్రిపిటికా:’ అని ఉంది. బౌద్ధ గ్రంథాలనూ ‘త్రిపిటికా’ అంటారు. దీంతో బౌద్ధం తర్వాత రామాయణం వచ్చిందని వాదించే వాళ్ల గురించి చెబుతూ ఈ జాతీయం వచ్చిందని నమ్మకం.
<<-se>>#EPICSAYINGS<<>>

News March 13, 2026

వనపర్తి: ‘సాగు, తాగునీటికి ఇబ్బంది కలగనివ్వద్దు’

image

వనపర్తి జిల్లాలో సాగు, తాగునీటితో పాటు విద్యుత్ సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. పంటలు చేతికి వచ్చే వరకు రైతులకు ఇబ్బంది కలగనివ్వద్దన్నారు. అలాగే జిల్లాలో LPG సిలిండర్ల కొరత లేదని, ఆసుపత్రులు, పాఠశాలలకు నిరంతరం సరఫరా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

News March 13, 2026

సీఎం ను కదిలించిన ఏలూరు కలెక్టర్

image

పాపికొండల అభయారణ్య పరిధిలోని గిరిజన గ్రామాల్లో బోరుబావులు, రహదారుల నిర్మాణానికి అటవీ అధికారులు అభ్యంతరం చెబుతున్నారని కలెక్టర్ల సదస్సులో కలెక్టర్ వెట్రిసెల్వి సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. స్పందించిన సీఎం గిరిజనులకు కనీస వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని, అటవీ అధికారులు కొంత వెసులుబాటు ఇవ్వాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో గిరిజనులకు మౌలిక సదుపాయాలు అందేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది.