News December 1, 2025

వరంగల్: రాజకీయ పార్టీల్లో వలసల జోరు!

image

రాజకీయ పార్టీల్లో వలసల జోరందుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అనే తేడా లేకుండా అన్ని పార్టీల్లోకి వలసలు కొనసాగుతున్నాయి. డబ్బు, మద్యం, పదవుల ఆశ చూపడంతో పార్టీల్లో చేరికల పరంపర కొనసాగుతోంది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో యువత ఓట్లు కీలకం కావడంతో వారిని తమ వైపు తిప్పుకోవడానికి నాయకులు ప్రయత్నిస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఆదివారం పార్టీల్లోకి చేరికలు జరిగాయి.

Similar News

News February 10, 2026

టీనేజ్ ప్రెగ్నెన్సీలో ‘రెడ్‌జోన్’లో కర్నూలు

image

కర్నూలు జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ శాతం 12కుపైగా నమోదు కావడంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఈ విషయంలో జిల్లా రెడ్ జోన్‌లో ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. దీనిపై అవగాహన పెంచి, బాల్య వివాహాలను అరికట్టాలని సీఎం ఆదేశించారు. నంద్యాల జిల్లాలోనూ 10 నుంచి 12 శాతంగా టీనేజ్ ప్రెగ్నెన్సీలు నమోదవుతున్నాయి.

News February 10, 2026

చిత్తూరు జిల్లాలో కష్టంగా పశుపోషణ…!

image

చిత్తూరు జిల్లాలో చలికాలం కావడంతో పశుపోషణ రైతులకు తీవ్ర భారంగా మారింది. చలి కారణంగా పచ్చి గడ్డి త్వరగా పెరగడం లేదు. పశువుల మేతకు కొరత ఏర్పడింది. దీంతో రైతులు ఎండు గడ్డిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం గడ్డి మోపు ధర ఒక్కటి రూ.300 వరకు పలుకుతోంది. దీంతో రైతులు పశువులను పోషించడమే భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాల రేట్లు తక్కువగా ఉండటంతో పశుపోషణ కష్టంగా మారింది.

News February 10, 2026

నాగార్జున సాగర్ కాలువలో లభ్యమైన శవం..!

image

త్రిపురారం మండలం ముకుందాపురం సమీపంలోని సాగర్ కాలువలో ఆదివారం సాయంత్రం అదుపు తప్పి కారు పడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో భార్య మృతిచెందగా భర్త పుల్లయ్య వరద ప్రవాహానికి కొట్టుకుపోయాడు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఈరోజు కంపసాగర్ చెరువులో పుల్లయ్య మృతదేహం లభ్యమైందని సీఐ సతీశ్ రెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నట్లు చెప్పారు.