News May 7, 2025

వరంగల్: రేపే BRS రజతోత్సవ సభ

image

WGL ఎల్కతుర్తిలో నిర్వహించనున్న BRS రజతోత్సవ సభకు మరో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. 10 నుంచి 15 లక్షల మందితో 1,250 ఎకరాల్లో రేపు ఈసభ జరగనుంది. 500మందికి సరిపడే విధంగా బాహుబలి వేదికను నిర్మించారు. 10లక్షల మజ్జిగ ప్యాకెట్లు, మంచినీళ్ల బాటిల్లు, రెండున్నరవేల మందికి పైనే వాలంటర్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. వెయ్యి ఎకరాలను 5 జోన్లుగా విభజించి పార్కింట్ ఏర్పాటు చేశారు. సభకు మీరు వెళ్తున్నారా? కామెంట్

Similar News

News February 9, 2026

బాలీవుడ్ హీరో స్టైల్‌లో బిల్డప్ ఇచ్చి.. అడ్డంగా దొరికిన నకిలీ IT ఆఫీసర్

image

బాలీవుడ్ హీరో స్టైల్‌లో ట్రేడర్లను బురిడీ కొట్టించాలని చూసిన ఓ నకిలీ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌కు చెందిన విజయ్‌సింగ్ చౌహాన్ (51) సూరత్‌లోని టెక్స్‌టైల్ మార్కెట్‌లో సీనియర్ IT అధికారిగా బిల్డప్ ఇస్తూ ₹30లక్షలు డిమాండ్ చేసి ₹4 లక్షలకు డీల్ కుదుర్చుకున్నాడు. పక్కనే ఉన్న హోటల్‌కు క్యాష్‌తో రమ్మన్నాడు. అయితే సదరు ట్రేడర్‌కు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

News February 9, 2026

రంగారెడ్డి జిల్లాలో 274 పోలింగ్ కేంద్రాలు

image

ఒకవైపు రాజకీయ పార్టీలన్నీ ప్రచారంలో మునిగితేలుతుండగా మరోవైపు ఎన్నికల సంఘం ఓటింగ్ ప్రక్రియకు కావాల్సిన ఏర్పాట్లలో నిమగ్నమైంది. RR జిల్లాలోని 126 వార్డుల్లో 1,75,974 మంది ఓటర్లు ఉండగా..వీరి కోసం 274 పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసింది.ఒక్కో పోలింగ్ కేంద్రంలో 500-800 మంది ఓటర్లు ఓటు వేసేలా ఏర్పాట్లు చేసింది. 620 బ్యాలెట్ బాక్సులు సహా 2.10 లక్షల బ్యాలెట్ పేపర్లు ముద్రించి,ఓటింగ్‌కు సిద్ధంగా ఉంచింది.

News February 9, 2026

సాయంత్రం 5 గంటల నుంచి సంగారెడ్డిలో సైలెన్స్ పీరియడ్

image

సంగారెడ్డి జిల్లాలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు సోమవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రావీణ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుంచి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు ఊరేగింపులు ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదన్నారు.