News April 22, 2024
వరంగల్ విమానాశ్రయ ఏర్పాటుకు అడుగులు?

మామునూరు ఎయిర్‌పోర్టు నుంచి చిన్న మైక్రోలైట్ విమానాలు ప్రయాణించేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం WGL ఎయిర్ స్ట్రిప్ పరిధిలో 706 ఎకరాలు ఉండగా.. మరో 400 ఎకరాలు కావాల్సి ఉంది. అందులో భాగంగా 253 ఎకరాలు కేటాయిస్తూ గతేడాది రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విమానాశ్రయం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కనీసం రూ.750 కోట్ల వరకు వెచ్చించాల్సి ఉంది.
Similar News
News December 15, 2025
గీసుగొండలో కొండా వర్గం పాగా!

పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ మండలంలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా వీడిపోయిన విషయం తెలిసిందే. గీసుగొండ మండలంలో 21 పంచాయతీల్లో రెండు ఏకగ్రీవం కాగా, మిగిలిన 19 పంచాయతీల్లో 7 పంచాయతీలకు కొండా వర్గం గెలిచింది. 3 బీఆర్ఎస్, 1 స్వతంత్ర, 8 రేవూరి కాంగ్రెస్ పార్టీలు గెలిచాయి. వాస్తవానికి కాంగ్రెస్ 15 పంచాయతీలు గెలిచినట్టు. రెండు వర్గాల ఆధిపత్య పోరుతో బీఆర్ఎస్‌కు డ్యామేజీ అయ్యింది.
News December 15, 2025
వంజరపల్లిలో ఉపసర్పంచ్ ఎన్నిక.. ఇతనే సర్పంచ్ నా ఇక..?

వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లిలో మోర్తల చందర్ రావు ఆరో వార్డు నుంచి గెలిచి ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ పదవి ఎస్టీకి రిజర్వ్ కావడంతో గిరిజనులు లేకపోవడం కారణంగా సర్పంచ్ పదవికి ఎవరూ నామినేషన్ వేయలేదు. ఇదే పరిస్థితితో 1, 4, 5 వార్డుల్లోనూ ఎస్టీకి రిజర్వు కాగా నామినేషన్లు నమోదు కాలేదు. గ్రామంలో 2, 3, 6, 7, 8 వార్డులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. దీంతో సర్పంచ్ ఇతనేనా..?
News December 14, 2025
నల్లబెల్లి ఆసక్తికర పోరు.. తల్లిపై కూతురు విజయం

వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి మండల కేంద్ర పంచాయతీ పరిధి నాలుగో వార్డులో జరిగిన ఎన్నికల్లో తల్లిపై కూతురు విజయం సాధించారు. ఈ సమరంలో తల్లి సరోజనపై కూతురు సౌజన్య స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ 120 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బీఆర్ఎస్ మద్దతుతో బరిలోకి దిగిన సౌజన్య గెలుపు ఆ పార్టీకి బలమైన ఉత్సాహాన్ని ఇచ్చిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.


