News October 5, 2025

వరంగల్: వేధిస్తే షీ టీంకు తెలియజేయండి!

image

మహిళలు, విద్యార్థినులను ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే తక్షణమే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఎస్సై యాదగిరి తెలిపారు. వరంగల్ షీ టీం ఆధ్వర్యంలో హన్మకొండలోని ఓ షాపింగ్ మాల్‌ సిబ్బందికి షీ టీంతో పాటు డయల్ 100, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, సైబర్ క్రైం, టీసేఫ్ యాప్‌పై అవగాహన కల్పించారు. ఎవరైనా వేధిస్తే మౌనంగా ఉండకుండా షీ టీంకు తెలపాలని సూచించారు.

Similar News

News January 24, 2026

కాగజ్‌నగర్‌లో విషాదం.. భవానీ మృతి

image

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పరిధి భట్టుపల్లి గ్రామంలో జరిగిన <<18938568>>రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన<<>> రామగోని భవానీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందిందని గ్రామస్థులు తెలిపారు. ప్రమాదం అనంతరం స్థానికులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా గాయాలు తీవ్రమవడంతో ప్రాణాలు నిలువలేదు. భవానీ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News January 24, 2026

వరంగల్ మార్కెట్‌కి 3 రోజుల వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 3 రోజుల సెలవులు రానున్నాయి. శనివారం వారంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు, సోమవారం రిపబ్లిక్ డే సందర్బంగా మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి మూడు రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి మంగళవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.

News January 24, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 24, శనివారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.31 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.07 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.22 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.