News May 7, 2025
వరంగల్: వేర్వేరు కారణాలతో ముగ్గురు సూసైడ్

వేర్వేరు కారణాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో శుక్రవారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాళ్లోకి వెళ్తే.. గుంటూరు(ఏపీ)కు చెందిన హర్షియాబేగం(28) ఆర్థిక ఇబ్బందులతో నర్సంపేటలో ఆత్మహత్య చేసుకుంది. కేసముద్రం(MHBD)కి చెందిన రమేశ్(36) కుటుంబ కలహాలతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. గుర్తు తెలియని ఓ వృద్ధురాలు(65-70) వరంగల్ రైల్వేస్టేషన్ యార్డులో రైలు కిందపడి సూసైడ్ చేసుకుంది.
Similar News
News February 16, 2026
సిద్దిపేట: సీల్డ్ కవర్ కోసం ఎదురుచూపులు

హుస్నాబాద్, చేర్యాల, గజ్వేల్, దుబ్బాక మున్సిపల్ పాలకవర్గాలు ఈరోజు కొలువు తీరనున్నాయి. ఛైర్మన్ ఎవరనేది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సీల్డ్ కవర్‌లో ఎవరి పేరుందనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. హుస్నాబాద్ నుంచి దండి లక్ష్మి పేరు ఫిక్స్ అయినట్లు సమాచారం. దుబ్బాకలో శ్రీరామ్ సంగీత, బండి శీలత మధ్య పోటీ ఉంది. గజ్వేల్‌లో కళ్యాణ్కర్ పద్మాబాయి, గంగిశెట్టి చందన, చేర్యాలలో అరుణ, గీతాంజలి పేర్లు ఉన్నాయి.
News February 16, 2026
ఆదిలాబాద్: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నేడే లాస్ట్

తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ ఖాళీల భర్తీకి నెల క్రితం నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తుకు నేడు చివరి తేదీ. పదో తరగతి మార్కుల మెరిట్‌తో వీటిని భర్తీ చేయనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ డివిజన్‌లో 54 ఖాళీలు ఉన్నాయి. అర్హులు నేటి సాయంత్రంలోగా indiapost.gov.inలో అప్లై చేయాలి. వేతనం వివరాలు: ☞ బీపీఎం పోస్టులకు నెలకు రూ.12,000-29,380 ☞ ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000- 24,470.
News February 16, 2026
బాపట్లకు ఆ పేరు ఎలా వచ్చిందంటే?

బాపట్ల పట్టణానికి ఆ పేరు పురాతన కాలం నుంచే వస్తున్న చారిత్రక నేపథ్యంతో ఏర్పడిందని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న భవానారాయణ స్వామి దేవాలయం కారణంగా అప్పట్లో ఈ ప్రాంతాన్ని భవపట్టణం, భావపురిగా పిలిచేవారు. కాలక్రమేణా స్థానిక ఉచ్చారణ మార్పులతో భవపట్టణం అనే పేరు రాను రాను బాపట్లగా మారిందని చెబుతున్నారు. దీంతో భవానారాయణ స్వామివారి పేరుతోనే బాపట్లకు ఈ పేరు వచ్చిందని స్థానికులు అంటున్నారు.


