News August 11, 2025

వరంగల్: సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు..!

image

ఉమ్మడి జిల్లాకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను రైతులకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వాటాతో ఈ పరికరాలను సమకూర్చేందుకు ముందుకు వచ్చింది. దీనికి గాను వరంగల్ రూ.87 లక్షలు, హనుమకొండకు రూ.73 లక్షలు, జనగామకు రూ.1.09 కోట్లు, మహబూబాబాద్‌కు రూ.1.15 కోట్లు, ములుగు రూ.38 లక్షలు, భూపాలపల్లికి రూ.66 లక్షలు కేటాయించారు. లబ్ధిదారులకు 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు.

Similar News

News March 11, 2026

విశాఖ: ఎన్నికలపై సందిగ్ధత

image

విశాఖలో భీమిలి నియోజకవర్గ పరిధిలోని సుమారు 64 గ్రామ పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఒకవేళ ఈ ప్రక్రియ ప్రారంభమైతే వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాల సవరణ, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇవి పూర్తయ్యే వరకు ఎన్నికలు వాయిదా పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది.

News March 11, 2026

నెల్లూరులో భారీగా మొబైల్ ఫోన్లు సీజ్

image

నెల్లూరులోని పలు మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ దుకాణాలపై అధికారులు దాడులు చేశారు. సరైన బిల్లులు, GST చెల్లించకుండా విక్రయిస్తున్న రూ.49.24 లక్షల విలువైన మొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరికరాలను సీజ్ చేశారు. ఈ సరుకును వాణిజ్య పన్నుల శాఖ అధికారులకు అప్పగించారు. జై అంబికా, శ్రీ అంబికా, జేపీ మొబైల్స్ షాపుల్లో విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ నరసింహారావు, DCTO విష్ణు రావు దాడులు చేశారు.

News March 11, 2026

24సార్లు చోరీ చేసినా కేసు పెట్టరా: భూమన

image

తిరుమల పరకామణి చోరీలపై భూమన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పెంచలయ్య 556gm బంగారం, 550gm వెండి చోరీ చేశాడు. 24సార్లు చోరీలకు పాల్పడితే ఒక్క కేసూ పెట్టలేదు. S.కృష్ణ కుమార్ అనే సీనియర్ అసిస్టెంట్ 950 విదేశీ కరెన్సీ నోట్లను చోరీ చేసినా అరెస్ట్ చేయలేదు. వీళ్ల వెనుక ఉన్న తిమింగలాలు ఎవరు’ అని ఆయన ప్రశ్నించారు. పెంచలయ్య దగ్గర రూ.3లక్షలు తీసుకుని కాంట్రాక్ట్ ఉద్యోగం ఇప్పించింది భూమనేనని BR నాయుడు ఆరోపించారు.