News June 15, 2024

వరంగల్: 17న ప్రీతి ఆత్మహత్య కేసు విచారణ

image

వరంగల్ కేఎంసీ అనస్తీషియా విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడైన డా. సైఫ్ ఈ నెల 17న ఉమ్మడి వరంగల్ ఎస్సీ, ఎస్టీ న్యాయస్థానంలో హాజరుకానున్నారు. న్యాయమూర్తి నేర నిర్ధారణ విచారణ చేయనున్నారు. అనంతరం ట్రయల్ తేదీల కోసం కేసు వాయిదా వేస్తారు. గత సంవత్సరం ఫిబ్రవరి 26న ప్రీతి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.

Similar News

News September 15, 2024

MHBD: 6 నెలల క్రితం వివాహం.. ఉరేసుకొని ఆత్మహత్య

image

MHBD జిల్లా సీరోల్ మండలం మన్నెగూడెంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన వినేశ్ అనుమానాస్పద స్థితిలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి గత 6 నెలల క్రితం వివాహమైంది. సమాచారం తెలుసుకున్న డోర్నకల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాగా, భార్యాభర్తల మధ్య గొడవలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.

News September 15, 2024

నిమజ్జనం సందర్భంగా వరంగల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

image

గణపతి నిమజ్జనం సందర్భంగా వరంగల్ ట్రైసిటీస్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. ఈ ఆంక్షలు సోమవారం మధ్యాహ్నం 12 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. ఖమ్మం, ములుగు, నర్సంపేట, హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఆంక్షలు తప్పక పాటించాలని తెలిపారు.

News September 15, 2024

వరంగల్: రేపే నిమజ్జనం.. జర భద్రం

image

గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ముగిస్తుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం గణనాథుడి నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. గ్రేటర్ పరిధిలోని పద్మాక్షి గుండం, బంధం చెరువు, చిన్న వడ్డేపల్లి, ఉర్సు, కోట, బెస్తం చెరువు, ఇతర ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరి మీ గణేశుడి నిమజ్జనం ఎప్పుడు? కామెంట్ చేయండి.