News September 25, 2024
వరంగల్: 27న యోగా టీచర్ పోస్టులకు ఇంటర్వ్యూ
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆయుష్ ఆరోగ్య కేంద్రాల్లో యోగా శిక్షకుల నియామకం చేపడుతున్నట్లు ప్రాంతీయ ఆయుష్ శాఖ ఆర్ డీడీ ప్రమీలాదేవి, ఆయుష్ జిల్లా ఇన్‌ఛార్జి డా.తనుజారాణి తెలిపారు. యోగా టీచర్ల నియామాకానికి ఈ నెల 27న వరంగల్ ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రిలో ఉదయం 10 గంటలకు ముఖాముఖి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు ఆయుష్మాన్ ఆర్డీడీ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.
Similar News
News October 10, 2024
తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ : మంత్రి సురేఖ
బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్తిత్వానికి, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అని మంత్రి కొండా సురేఖ అన్నారు. రేపు సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మంత్రి సురేఖ తెలంగాణ ఆడపడుచులకు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంగు రంగుల పూల రూపంలోని ప్రకృతి పట్ల ఆరాధనను, స్త్రీ శక్తిని కొలిచే పండుగగా బతుకమ్మ పండుగకు తెలంగాణ సంస్కృతిలో విశిష్ట స్థానముందన్నారు.
News October 9, 2024
సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి సీతక్క
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ అమలు, బీసీ కులగణన అంశాలపై మంత్రివర్గ ఉప సంఘం సభ్యులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. అనంతరం వర్గీకరణ అమలు, బీసీ కులగణనకు సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
News October 9, 2024
నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క
హైదరాబాదులో డీఎస్సీ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మంత్రి సీతక్క జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.