News April 10, 2025
వరంగల్: 6 వేల ఉద్యోగాలు.. దాదాపు 50 కంపెనీలు!

వరంగల్ మహా నగరంలో మంత్రి కొండా సురేఖ చొరవతో శుక్రవారం మెగా జాబ్ మేళాను నిర్వహించనున్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ రోడ్డులోని MK నాయుడు కన్వెన్షన్ హాల్‌లో జరిగే ఈ జాబ్ మేళాలో సుమారు 6 వేల ఉద్యోగాల భర్తీకి 50కి పైగా ప్రైవేట్ కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News January 20, 2026
చిత్తూరు; స్కూల్‌లో క్షుద్ర పూజల కలకలం

చౌడేపల్లి (M) కాగతి ప్రాథమికోన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలకు ఉదయం ఆవరణంలోకి వచ్చి ముగ్గు వేసి, నిమ్మకాయలు కోసి, అక్షింతలు వేసి తాంత్రిక పూజలు చేసినట్లు సీసీ కెమెరాలులో నమోదయ్యాయి. ఈ ఘటన చూసిన ఉపాధ్యాయులు, పిల్లలు భయాందోళనకు గురవుతున్నారు. పలుమార్లు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తూ చౌడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News January 20, 2026
విజయవాడ: పది రోజుల్లో అదిరిపోయే ఆదాయం!

సంక్రాంతి సందర్భంగా విజయవాడ బస్టాండ్ నుంచి 547 అదనపు సర్వీసులతోపాటు, ఆర్టీసీ లోకల్ సర్వీసుల ఏర్పాటుతో గణనీయంగా ఆదాయం రాబట్టుకుంది. ఈ నెల 8 నుంచి 19 వరకు రూ.1.20 కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాది రూ.70-80 లక్షలు రాగా.. ఈ ఏడాది పెరిగింది. మచిలీపట్నం కేంద్రం పరిధిలో మరో రూ. 30-50 లక్షలకు పైగా ఆదాయం వచ్చింది. ఉమ్మడి కృష్ణా జిల్లా కలిపి రూ.1.50 కోట్లకు పైగా పది రోజుల్లోనే ఆదాయం రావడం విశేషం.
News January 20, 2026
వెంకీ ‘AK-47’లో నారా రోహిత్?

విక్టరీ వెంకటేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘ఆదర్శ కుటుంబం’(AK-47)లో హీరో నారా రోహిత్ నటిస్తారని తెలుస్తోంది. విలన్ షేడ్స్ ఉన్న పోలీస్ రోల్‌లో ఆయన కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే మూవీ షూటింగ్ కొనసాగుతుండగా రోహిత్ పాల్గొన్నారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. సమ్మర్‌లో రిలీజ్ చేస్తామని ప్రకటించినా విడుదల తేదీ మారుస్తారని టాక్.


