News November 6, 2025
వరల్డ్ కప్ విజేతలకు కార్లు గిఫ్ట్ ఇవ్వనున్న TATA

మహిళల ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్ శుభవార్త చెప్పింది. త్వరలో విడుదల కానున్న Tata Sierra SUV మొదటి బ్యాచ్‌లోని టాప్ఎండ్ మోడల్‌ను జట్టులోని ప్రతి సభ్యురాలికి బహుమతిగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. WC విజేతలు & రీఎంట్రీ ఇస్తున్న లెజెండరీ సియెర్రా రెండూ పట్టుదల, ధైర్యం, స్ఫూర్తికి ప్రతీకలని టాటా మోటార్స్ కొనియాడింది. కాగా ఈ కారు నవంబర్ 25న లాంచ్ కానుంది.
Similar News
News January 22, 2026
ఇత్తడి పూజా సామాగ్రి మెరిసిపోవాలంటే..

మంగళకర పూజల్లో ఇత్తడి వస్తువులది ప్రత్యేక స్థానం. కొన్ని కారణాల వల్ల వెలవెలబోయిన ఈ పాత్రలను చింతపండు గుజ్జుతో శుభ్రం చేయాలి. అందువల్ల వాటి సహజ కాంతి మళ్లీ వస్తుంది. సున్నం, ఉప్పు, వెనిగర్ మిశ్రమంతో సున్నితంగా స్క్రబ్ చేసినా మొండి మరకలు తొలగిపోతాయి. ఆ పాత్రలు మళ్లీ పుత్తడిలా మెరుస్తాయి. చివరగా వేడినీటితో కడిగి, పొడి వస్త్రంతో తుడిచి ఆరబెడితే మీ పూజా సామాగ్రి ఎల్లప్పుడూ దైవకళతో తళతళలాడుతూ ఉంటాయి.
News January 22, 2026
ఈ నెల 30న ఓటీటీలోకి ‘ధురంధర్’!

అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రంగా నిలిచిన ‘ధురంధర్’ త్వరలోనే ఓటీటీ అభిమానులను అలరించనుంది. ఈ సినిమా రైట్స్ దక్కించుకున్న నెట్‌ఫ్లిక్స్ ఈ నెల 30 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన ధురంధర్ చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ మూవీ మొత్తం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. మీరూ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారా?
News January 22, 2026
ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

AP: మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఈడీ విచారణ ముగిసింది. లిక్కర్ స్కామ్ కేసులో హైదరాబాద్ కార్యాలయంలో ఆయనను సుమారు 7 గంటల పాటు విచారించింది. పాలసీ విధాన నిర్ణయాలు, రహస్య ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసిన ఈడీ అధికారులు విజయసాయి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. ఆర్థిక లావాదేవీలపై అధికారులకు ఆయన కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారు.


