News November 19, 2025

వరికోత మిషన్ల కొరత.. రైతుల ఆందోళన

image

ఖమ్మం జిల్లాలో వరికోతల సమయంలో మిషన్ల కొరత ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వచ్చిన మొంథా తుపాను కారణంగా రైతులు వరికోతలు వాయిదా వేసుకున్నారు. దీంతో పంట పొలాలన్నీ ఒకేసారి కోతకు రావడంతో మిషన్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట చేతికొచ్చే అవకాశం ఉండదని అన్నదాతలు వాపోతున్నారు.

Similar News

News January 12, 2026

ములుగు: యంగ్ ఇండియా స్కూల్స్, మున్సిపల్ ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణాలను వేగవంతం చేయాలని, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ములుగు నుంచి జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. నిర్మాణాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎస్ రామకృష్ణారావు తెలిపారు.

News January 12, 2026

ప్రజావాణిలో 129 వినతులు స్వీకరణ: వరంగల్ కలెక్టర్

image

వరంగల్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సత్య శారద హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌వో విజయలక్ష్మి, ఆర్డీవోలు సుమ, ఉమారాణి పాల్గొన్నారు. మొత్తం 129 దరఖాస్తులు అందగా వాటిలో రెవెన్యూ సంబంధిత 52 ఉన్నాయి. భూ సమస్యలు, పింఛన్లు, గృహాలు, సంక్షేమ పథకాలపై వచ్చిన వినతులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

News January 12, 2026

ఆర్సీబీ ఘన విజయం

image

WPL-2026లో యూపీ వారియర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం సాధించింది. 144 పరుగుల లక్ష్యాన్ని 12.1 ఓవర్లలో వికెట్ నష్టపోయి ఛేదించింది. ఓపెనర్ హారిస్(85) 10 ఫోర్లు, 5 సిక్సర్లతో విధ్వంసం సృష్టించగా మరో ఓపెనర్ స్మృతి(47*) ఆమెకు సహకారం అందించారు. హారిస్ ఔటైనా రిచా(4*)తో కలిసి స్మృతి జట్టును విజయతీరాలకు చేర్చారు. ఇది ఆర్సీబీకి వరుసగా రెండో విజయం. మరోవైపు యూపీ ఆడిన రెండు మ్యాచుల్లోనూ పరాజయం పాలైంది.