News November 19, 2025
వరికోత మిషన్ల కొరత.. రైతుల ఆందోళన

ఖమ్మం జిల్లాలో వరికోతల సమయంలో మిషన్ల కొరత ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల వచ్చిన మొంథా తుపాను కారణంగా రైతులు వరికోతలు వాయిదా వేసుకున్నారు. దీంతో పంట పొలాలన్నీ ఒకేసారి కోతకు రావడంతో మిషన్లు అందుబాటులో లేక ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పంట చేతికొచ్చే అవకాశం ఉండదని అన్నదాతలు వాపోతున్నారు.
Similar News
News January 19, 2026
గద్వాల్: సింగోటం జాతరకి వెళ్లి వస్తుండగా ప్రమాదం

కర్నూలు జిల్లా పంచలింగాల గ్రామానికి చెందిన 20 మంది భక్తులు సింగోటం జాతరలో నరసింహస్వామి వారిని దర్శించుకుని ట్రాక్టర్‌లో తిరిగి ఎర్రవల్లి మండలం వేముల స్టేజి దగ్గర సోమవారం తెల్లవారుజామున వెనుక నుంచి నుంచి డీసీఎం ఢీకొంది. ఈ ఘటనలో ఖాజా గౌడ్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనం ద్వారా కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News January 19, 2026
పంతం పక్కనబెట్టి ఈ పనులు నేర్చుకోండోయ్!

నగరాలు, పట్టణాల్లో ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లకు విపరీతమైన <<18865388>>డిమాండ్<<>> నెలకొంది. చిన్నపని చేసినా రూ.500-1,000 వరకు తీసుకుంటున్నారు. అయితే ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ నిరుద్యోగులు ఆ పనులు చేసేందుకు ఇష్టపడట్లేదు. సొసైటీలో తమ హోదా తగ్గుతుందని, వైట్ కాలర్ జాబ్స్ మాత్రమే చేస్తామంటున్నారు. ఆ పంతం పక్కనబెట్టి స్కిల్స్ నేర్చుకుంటే సాఫ్ట్‌వేర్ జాబ్ కంటే ఎక్కువ సంపాదించవచ్చని నిపుణుల మాట. ఏమంటారు?
News January 19, 2026
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

<


