News March 14, 2025
వర్గల్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

వర్గల్ మండలం గౌరారం రాజీవ్ రహదారిపై ఈనెల 10న జరిగిన రోడ్డు ప్రమాదంలో గౌరారంలో నివాసం ఉంటున్న దుర్గాప్రసాద్ (28) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం ఆర్వీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడు దుర్గాప్రసాద్‌కు భార్య, రెండు సంవత్సరాల కూతురు, రెండు నెలల బాబు ఉన్నారు.
Similar News
News February 19, 2026
సర్కార్‌కు షాక్.. GHMC 3 ముక్కలాటపై హైకోర్టు సీరియస్..!

HYDను 3ముక్కలు చేస్తూ సర్కార్ తెచ్చిన GOపై హైకోర్టులో వాదనలు మొదలయ్యాయి. 2027 జనగణన నేపథ్యంలో సరిహద్దుల మార్పుపై కేంద్రం ఫ్రీజ్ విధించినా రూల్స్‌కు విరుద్ధంగా GHMC విభజన నిర్ణయం తీసుకున్నారని గురువారెడ్డి పిల్ వేశారు. దీనిపై స్పందించిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ 3వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీంతో విభజన ప్రక్రియపై నీలినీడలు కమ్ముకున్నాయి.
News February 19, 2026
NGKL: చేపలు అమ్మడానికి సబ్సిడీపై వాహనాలు

NGKL జిల్లాలో చేపల విక్రయానికి గాను మత్స్యకారులకు సబ్సిడీపై వాహనాలు ఇవ్వనున్నట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి నరసింహారావు తెలిపారు. PM మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా 13 మోటార్ సైకిల్స్, అదేవిధంగా ఐస్ బాక్స్‌లు మంజూరు అయినట్లు తెలిపారు. ఒక్క యూనిట్ 75,000 ఉంటుందని, అందులో జనరల్ 7, మహిళలకు 2, ఎస్సీ 2, ఎస్టి 2, జనరల్ కు 40 శాతం, ఎస్సీ ఎస్టీలకు 60% సబ్సిడీ ఉంటుందని తెలిపారు. దరఖాస్తు చేసుకోవాలన్నారు.
News February 19, 2026
విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ చికిత్స

విజయనగరం సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్ రోగుల కోసం అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి సూపరిటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజ తెలిపారు. క్యాన్సర్ వ్యాధి (Oncology) ఓపీ ప్రతి సోమవారం, గురువారం, ప్రివెంటివ్ క్యాన్సర్ (నివారణ) ఓపీ ప్రతి మంగళవారం, గురువారం ఉంటుందన్నారు. ముక్క పరీక్ష (Biopsy) ఆసుపత్రిలోని హిస్టోపాథాలజీ ల్యాబ్‌లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


