News September 13, 2025
వర్జీనియా పొగాకు ధర అధరహో

వర్జీనియా పొగాకు ధరలు శుక్రవారం ఒక్కసారిగా పెరిగాయి. గత ఏడాది కిలో క్వాలిటీ పొగాకు గరిష్ఠ ధర రూ.411 ఆల్ టైమ్ రికార్డు కాగా ప్రస్తుతం రూ.418 పలికింది. జంగారెడ్డిగూడెం వేలం కేంద్రం–32లో కిలో పొగాకు ధర రూ.418, వేలం కేంద్రం–18లో రూ.417, కొయ్యలగూడెంలో రూ.418, గోపాలపురంలో రూ.416, దేవరపల్లిలో రూ.416 ధర పలికింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 15, 2025
తూ.గో: ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ

పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నూతన సంవత్సరంలో ఇవ్వాల్సిన పెన్షన్‌ను డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన వెలువడింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్‌ను అందజేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

News December 14, 2025
రాజమండ్రి: టెట్ పరీక్షల్లో 129 మంది గైర్హాజరు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2025) ఐదవ రోజు ఆదివారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారి కె. వాసుదేవరావు తెలిపారు. రాజమండ్రి లూధర్ గిరిలో ఉన్న రాజీవ్ గాంధీ కళాశాలలో మొదటి షిఫ్ట్‌లో 955 మందికి 895 మంది హాజరయ్యారని, 60 మంది గైర్హాజరు అయ్యారన్నారు. మధ్యాహ్నం రెండవ షిఫ్ట్‌లో 700 మందికి 631 మంది హాజరైనట్లు, 69 మంది గైర్హాజరు అయినట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు.