News November 30, 2025
వర్షాలు.. మంత్రి ఆనం కీలక ఆదేశాలు

భారీ వర్షాలు, దిత్వా తుఫాను నేపథ్యంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా తుఫాన్ ప్రత్యేక అధికారి యువరాజ్ IAS, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు, ఇంజినీరింగ్ విభాగాలతో చర్చించారు. సోమశిల, కండలేరు, సంగం, నెల్లూరు బ్యారేజ్‌ల నీటి ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో వివరాలను తెలుసుకున్నారు. వాగులు, జలాశయాల వద్ద ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని ఆదేశించారు.
Similar News
News February 18, 2026
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన అల్లూరు సబ్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ స్థానంలో ఒంగోలు జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. నూతన రిజిస్ట్రార్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.
News February 18, 2026
నెల్లూరు జిల్లా లాడ్జీల్లో తనిఖీలు

ఎస్పీ అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు మంగళవారం రాత్రి లాడ్జీలు, హోటల్స్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రికార్డులను పరిశీలించారు. లాడ్జీల్లోని ప్రతీ గదిని క్షుణ్ణంగా చెకింగ్ చేశారు. రాత్రి వేళల్లో లాడ్జిల్లో బస చేసిన వ్యక్తులను ప్రశ్నించారు. వారి వివరాలను ఆరా తీశారు.