News August 12, 2025
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి: నిర్మల్ ఎస్పీ

నిర్మల్ జిల్లా ప్రజలు రాబోయే 72 గంటల్లో అతి భారీ వర్షాల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల సూచించారు. లోతట్టు ప్రాంతాలకు వెళ్లొద్దని, చెరువులు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని ఆమె కోరారు. ముఖ్యంగా వ్యవసాయ రైతులు విద్యుత్ తీగలు, స్తంభాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. అత్యవసర సహాయం కోసం ప్రజలు 100కు కాల్ చేయాలన్నారు.
Similar News
News March 13, 2026
పశువుల్లో గాలికుంటు వ్యాధి లక్షణాలను ఇలా గుర్తించండి

ఈ వ్యాధి సోకిన పశువులకు గిట్టల మధ్య బొబ్బలు ఏర్పడతాయి. 3, 4 వారాల్లో బొబ్బలు పగిలి పుండ్లుగా మారతాయి. చర్మం గరుకుగా మారి నోటి చిగుళ్లపై పొక్కులు ఏర్పడటం వల్ల పశువులు మేత మేయలేవు. నీరసంగా ఉంటాయి. పశువుకు 104 నుంచి 105 డిగ్రీల ఫారన్ హీట్ వరకు జ్వరం ఉంటుంది. పాడిగేదెల్లో పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఎద్దుల్లో రోగ నిరోధకశక్తి తగ్గి అలసటకు గురై నీరసంగా మారతాయి.
News March 13, 2026
NZB: 398 మంది విద్యార్థులు గైర్హాజరు

NZB జిల్లాలోని 58 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలకు 398 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు DIEO రవికుమార్ తెలిపారు. మొత్తం 16,119 మంది విద్యార్థులకు గాను 15,721 మంది హాజరయ్యారన్నారు. జనరల్‌లో 14,085 మంది విద్యార్థులకు గాను 13,783 మంది విద్యార్థులు, ఒకేషనల్‌లో 2,034 మంది విద్యార్థులకు గాను 1,938 మంది పరీక్షలు రాసినట్లు తెలిపారు.
News March 13, 2026
VKB: గ్యాస్ సరఫరాలో అక్రమాలకు తావుండొద్దు: కలెక్టర్

వినియోగదారులకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ఓ గ్యాస్ ఏజెన్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ నిల్వలు, పంపిణీ రికార్డులను పరిశీలించి, కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమాలకు తావివ్వకుండా, సకాలంలో సిలిండర్లను సరఫరా చేయాలని ఏజెన్సీ నిర్వాహకులకు, అధికారులకు స్పష్టం చేశారు.


