News August 13, 2025
వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ హనుమంతరావు

రాబోయే 72 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, అధికారులు 24 గంటలు అందుబాటులో ఉంటారని తెలిపారు.
Similar News
News March 14, 2026
విధులు నిర్వాహణలో నిర్లక్ష్యం వహించరాదు: SKLM కలెక్టర్

విధులు నిర్వాహణలో నిర్లక్ష్యం వహించరాదని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పైపులైన్ కనెక్షన్లుపై ఎమినిటి సెక్రటరీస్, మున్సిపల్ అధికారులతో శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయంలో శనివారం సమావేశం నిర్వహించారు. నగరంలో జరుగుతున్న డ్రైనేజీ పనులు, మంచినీటి పైపులైన్లు పనుల్లో ఎక్కడ రాజీ పడకుండా వేగవంతం చేయాలని ఆదేశించారు. అధికారులు అలసత్వంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు.
News March 14, 2026
జగిత్యాల : పదవ తరగతి పరీక్షలలో 11 మంది గైర్హాజరు

జగిత్యాల జిల్లాలో శనివారం జరిగిన పదవ తరగతి పరీక్షలలో 11 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాము తెలిపారు. 68 పరీక్ష కేంద్రాలలో 12684 మంది విద్యార్థులకు గాను 12673 మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు పేర్కొన్నారు. 99.91 % హాజరు శాతం నమోదైనట్లు పేర్కొన్నారు. సప్లిమెంటరీ విద్యార్థులు 12 మందికి గాను 12 మంది హాజరైనట్లు పేర్కొన్నారు.
News March 14, 2026
నర్మెట్ట: ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని పరిశీలించిన మంత్రులు

సిద్దిపేట జిల్లా నర్మెట్ట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఈనెల 22న సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి పొన్నం మాట్లాడుతూ.. గతంలో ప్రతిపాదనలకే పరిమితమైన ఈ ఫ్యాక్టరీని మంత్రి తుమ్మల రూ.300 కోట్ల నిధులతో పూర్తి చేయించారని తెలిపారు. ఈ పరిశ్రమ ఈ ప్రాంత రైతుల అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని మంత్రులు పేర్కొన్నారు.


