News May 7, 2025
వలిగొండ: బ్రిడ్జిపై నుంచి పల్టీ కొట్టిన కారు

భువనగిరి జిల్లా వలిగొండ మండలం నర్సాపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపుతప్పి బ్రిడ్జి పై నుంచి పల్టీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న భూక్య సంతోష్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికుల సహాయంతో క్షతగాత్రుడిని భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 11, 2026
పుట్టిన రోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 11, 2026
సామాజిక కార్యకర్తలకు సన్మానం చేసిన అర్జున్

నటుడు అర్జున్ ‘సీతాపయనం’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో తన గొప్ప మనసు చాటుకున్నారు. ముగ్గురు సామాజిక కార్యకర్తలను ఆయన వేదికపై సన్మానించారు. ట్యాంక్ బండ్ శివ, ప్రకృతి ప్రేమికుడు దుశ్చర్ల సత్యనారాయణ, వైద్యులు, సంఘ సేవకులు ప్రకాశ్ ఆమ్టే దంపతులకు రూ.లక్ష చొప్పున అందజేశారు. అర్జున్ దర్శకత్వం వహించిన ‘సీతాపయనం’లో ఆయన కూతురు ఐశ్వర్య హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ఈ నెల 14న థియేటర్లలో విడుదల కానుంది.
News February 11, 2026
ఈ రోజు నమాజ్ వేళలు (FEB 11, బుధవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.31 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.16 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.


