News November 19, 2025

వల్లభాపురం: ప్రమాదవశాత్తు యంత్రంలో పడి మహిళ మృతి

image

కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగ లంకకు మినుములు నూర్చడానికి వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కొల్లిపర ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. వల్లూరుపాలెంకు చెందిన షేక్ కాసింబి(40) ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Similar News

News January 23, 2026

యూనస్‌ ఫాసిస్ట్, దేశద్రోహి: షేక్ హసీనా

image

BANలో యూనస్ ప్రభుత్వాన్ని కూలదోయాలని ఆ దేశ మాజీ PM షేక్ హసీనా అన్నారు. ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఏషియాలో ఆమె ఆడియో మెసేజ్‌ను నిర్వాహకులు ప్లే చేశారు. యూనస్‌ను ఫాసిస్ట్, దేశద్రోహిగా, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వాన్ని విదేశాలకు సేవ చేసే కీలు బొమ్మగా ఆమె అభివర్ణించారు. దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. గతేడాది జరిగిన హింసాత్మక ఘటనలపై UNతో ఇన్వెస్టిగేషన్ చేయించాలన్నారు.

News January 23, 2026

తిరుపతి: మూడో రోజు 35 మంది గైర్హాజరు

image

తిరుపతి జిల్లాలో JEE మెయిన్స్ పరీక్షలు మూడో రోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తిరుపతి సిటీ కోఆర్డినేటర్ టి.కైలాష్ నాథ్ మాట్లాడుతూ.. మొత్తం 2,111 మందికి గాను 2,076 మంది అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు. 35 మంది గైర్హాజరైనట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పరీక్ష ముగిసింది.

News January 23, 2026

పీఎం శ్రీ పనులు సకాలంలో పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

image

జగిత్యాల జిల్లాలో పీఎం శ్రీ పథకం కింద ఎంపికైన 20 పాఠశాలల్లో మంజూరైన పనులను సకాలంలో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బి.ఎస్. లత హెచ్ఎంలను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో నిధులను నాణ్యతతో ఖర్చు చేసి పనులు వేగంగా పూర్తి చేస్తే తదుపరి విడత నిధులు వచ్చే అవకాశముందని తెలిపారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని పనులను గడువులోపు పూర్తి చేయాలని సూచించారు.