News November 19, 2025
వల్లభాపురం: ప్రమాదవశాత్తు యంత్రంలో పడి మహిళ మృతి

కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగ లంకకు మినుములు నూర్చడానికి వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కొల్లిపర ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. వల్లూరుపాలెంకు చెందిన షేక్ కాసింబి(40) ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News January 18, 2026
వికారాబాద్: మున్సిపల్ పోరుకు రంగం సిద్ధం!

వికారాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాండూర్, పరిగి, వికారాబాద్, కొడంగల్ మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. తమ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా స్థానిక MLAలు ఇప్పుడు బిజీగా గడుపుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే టికెట్ల కోసం వేట మొదలైంది.

ఇవాళ ప్రకాశం జిల్లాకు రానున్న ఇన్‌ఛార్జ్ మంత్రి

ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఒంగోలులో జరిగే నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో జిల్లాకు చెందిన మంత్రి స్వామి, పలువురు ఎమ్మెల్యేలు సైతం పాల్గొననున్నారు.