News November 19, 2025
వల్లభాపురం: ప్రమాదవశాత్తు యంత్రంలో పడి మహిళ మృతి

కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామపంచాయతీ పరిధిలోని మాదిగ లంకకు మినుములు నూర్చడానికి వచ్చిన మహిళ ప్రమాదవశాత్తు చనిపోయినట్లు కొల్లిపర ఎస్సై పి.కోటేశ్వరరావు తెలిపారు. వల్లూరుపాలెంకు చెందిన షేక్ కాసింబి(40) ప్రమాదవశాత్తు మినుము నూర్పిడి యంత్రంలో చీర ఇరుక్కుని చేతులు, మెడకు తీవ్ర గాయాలై చనిపోయినట్లు తెలిపారు. ఆమె భర్త ఇస్మాయిల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
Similar News
News January 14, 2026
బస్సులో ప్రయాణించిన మంత్రి సురేఖ

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా ఐనవోలులో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్‌ను మంత్రి కొండ సురేఖ ప్రారంభించారు. ఈ సందర్భంగా బస్సులో మంత్రి సురేఖ మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ టికెట్ పొంది ప్రయాణించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.
News January 14, 2026
ఇందిరమ్మ పథకం.. ఖాతాల్లో డబ్బులు జమ

TG: ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రతి వారం బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో భాగంగా ప్రస్తుత వారానికి రూ.152.40 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తాన్ని 13,861 మంది ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొంది. ఇప్పటివరకు 2.50 లక్షల ఇళ్ల పనులు ప్రారంభమయ్యాయని, మార్చి నాటికి నిర్మాణాలు పూర్తవుతాయని తెలిపింది. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1800 599 5991కు ఫిర్యాదు చేయాలని సూచించింది.
News January 14, 2026
జర్నలిస్టుల అరెస్టులు.. KTR సంచలన వ్యాఖ్యలు

జర్నలిస్టుల అరెస్టు విషయంలో రాహుల్ గాంధీ వైఖరిని KTR ఖండించారు. ‘మీ మొహబ్బత్ కీ దుకాన్ తెలంగాణ పౌరుల రాజ్యాంగ హక్కులను ఏ విధంగా కాలరాస్తోందో గమనిస్తున్నారని ఆశిస్తున్నాను. నిన్న రాత్రి ముగ్గురు జర్నలిస్టులను రాష్ట్ర పోలీసులు అపహరించారు. పోలీసులు జర్నలిస్టుల ఇళ్ల తలుపులు పగులగొట్టారు. ఇది కేవలం బెయిలబుల్ సెక్షన్లు ఉన్న కేసు, పోలీసులు BNSS సెక్షన్ 35 కింద నోటీసు ఇచ్చి ఉండవచ్చు’ అని Xలో ఖండించారు.


