News May 2, 2024

వల్లూరు: చెరువులో బాలుడి మృతదేహం

image

వల్లూరు మండలంలోని గోటూరు గ్రామ పరిధి చెరువులో గుర్తు తెలియని బాలుడి మృతదేహం పడి ఉంది. గురువారం తెల్లవారు జామున బాలుడి మృతదేహాన్ని స్థానికులకు చెరువు నీటిలో నిర్జీవంగా తేలియాడుతూ కనిపించింది. బాలుడి మృతదేహాన్ని బట్టి చూస్తే వయసు ఐదు సంవత్సరాలు ఉండవచ్చు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 8, 2025

రాయచోటిలో ప్రాణం తీసిన కుక్కలు

image

రాయచోటిలో అర్ధరాత్రి దారుణ ఘటన జరిగింది. పట్టణంలోని గాలివీడు రోడ్డులో ఓ వ్యక్తి బైకుపై వస్తుండగా కొత్త పోలీస్ స్టేషన్ సమీపంలో కుక్కలు వెంటపడ్డాయి. ఈక్రమంలో అతను అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిని ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడటంతో అక్కడిక్కడే మృతిచెందినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మృతుడు పజిల్(42)గా గుర్తించారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 8, 2025

కడప: కరెంట్ సమస్యలు ఉన్నాయా.. ఈ నంబర్‌కు కాల్ చేయండి.!

image

కడప జిల్లాలో విద్యుత్ సమస్యలపై ఇవాళ ఉదయం 10 గంటల నుంచి 12 వరకు డయల్ యువర్ CMD కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ MD శివశంకర్ తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఏమన్నా ఇబ్బందులు ఉంటే ప్రజలు 89777-16661 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. జిల్లా వాసులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.

News December 8, 2025

కడపలో నేరాలపై కఠిన చర్యలు.. ఎస్పీ నచికేత్ హెచ్చరిక

image

కడప జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు ఎస్పీ షెల్కే నచికేత్ ఆదివారం తెలిపారు. నవంబర్ నెలలో 23.5 కిలోల గంజాయి, 1620 మత్తు మాత్రలు స్వాధీనం చేసుకుని 9 మందిని అరెస్టు చేశారు. ఎంవీ యాక్ట్ ఉల్లంఘించిన వారిపై 6527 కేసులు నమోదు చేసి రూ.16.16 లక్షల జరిమానా విధించారు. గంజాయి, బెట్టింగ్ వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, సమాచారం ఉంటే డయల్ 112కు తెలపాలని ఎస్పీ సూచించారు.