News August 20, 2025

వాగుల వద్ద సెల్ఫీల కోసం వెళ్లొద్దు: ఎస్పీ

image

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న చెరువులు, వాగులు, వంకల వద్దకు వీడియోల కోసం సెల్ఫీల కోసం వెళ్లి ప్రమాదాలకు గురి కావద్దని సూచించారు. ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో వెంటనే 100కు ఫోన్ చేసి పోలీసు సేవలను వినియోగించుకోవాలని ఎస్పీ సూచించారు.

Similar News

News January 23, 2026

మధిర: జిల్లాల రద్దు లేదు: భట్టి

image

తెలంగాణలో కొత్త జిల్లాలను ఎత్తివేస్తారంటూ కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముగింపు పలికారు. జిల్లాల రద్దు అనే ఆలోచనే ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే, సింగరేణి సంస్థ ఆస్తులను కాపాడతామని, సంస్థ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని హామీ ఇచ్చారు. సింగరేణి వివాదంపై రేపు పూర్తి వివరాలతో బహిరంగంగా మాట్లాడతానని ఆయన వెల్లడించారు.

News January 23, 2026

NLG: మూగజీవాల దాహార్తిని తీర్చాలి: కలెక్టర్‌

image

వేసవిలో జంతువుల సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన SPCA సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎండల దృష్ట్యా పట్టణాలు, గ్రామాల్లో జంతువుల కోసం నీటి తొట్లు ఏర్పాటు చేయాలని అధికారులను సూచించారు. ఆవుల దత్తతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, పశువులకు నీడ, వైద్య సదుపాయాలు కల్పించాలని కోరారు. అనంతరం గ్రామీణ పశు వైద్యులకు ఎండోస్కోప్‌ కిట్లను పంపిణీ చేసారు.

News January 23, 2026

పాల్వంచ: ‘మన ఇసుక వాహనం’పై కలెక్టర్ సమీక్ష

image

తెలంగాణ రాష్ట్రంలో ఇసుక రవాణా, సరఫరా వ్యవస్థను పూర్తిగా పారదర్శకంగా, నియంత్రిత విధానంలో అమలు చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఇసుక వాహనం’ ఆన్‌లైన్ సాండ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిందని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా, నిల్వలు, అవినీతి వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ కొత్త విధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.