News August 23, 2025
వాడ్రాపల్లి: పొలంలో వరి నాట్లు వేసిన కలెక్టర్

మునగపాక (M) వాడ్రాపల్లిలో కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం పర్యటించారు. నాట్లు వేసిన వరి పొలాలను పరిశీలించారు. పొలాల వద్దకు వెళ్లిన కలెక్టర్ కూలీలతో కలిసి నాట్లు వేశారు. ఈ సమయంలో రైతులు మెళుకువలు పాటిస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చునని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావు, తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్ల వరాహ నర్సింగరావు పాల్గొన్నారు.
Similar News
News January 13, 2026
పులివెందుల హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు శిక్ష

పులివెందుల అప్‌గ్రేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండున్నర సంవత్సరాల కిందట జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులకు 3 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ కడప అదనపు సెషన్స్ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఫిర్యాదిదారుడిపై కత్తితో దాడి చేసినట్టు నేరం రుజువుకావడంతో ఈ శిక్ష విధించారు. ఈ కేసులో అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీతో పాటు పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
News January 13, 2026
సంగారెడ్డి: హాజరు ఆధారంగానే జీతాలు: కలెక్టర్

సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది హాజరు కోసం ఫేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానాన్ని అమలు చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సోమవారం వైద్యశాఖపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతూ.. హాజరు ఆధారంగానే జీతాల చెల్లింపులు జరగాలని స్పష్టం చేశారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులకు మెరుగైన సేవలు అందించాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
News January 13, 2026
ఎంత ప్రయత్నించినా పెళ్లి కావడం లేదా? రేపే లాస్ట్..

ఎన్ని ప్రయత్నాలు చేసినా పెళ్లి సంబంధం కుదరని వారు రేపు గోదా రంగనాథుల కళ్యాణాన్ని వీక్షించాలని పండితులు సూచిస్తున్నారు. ఈ వేడుకను దర్శిస్తే తప్పక వివాహ యోగం కలుగుతుందని అంటున్నారు. ‘స్వామివారి కళ్యాణాన్ని వీక్షించడం వల్ల జాతకంలోని వివాహ ప్రతిబంధకాలు తొలగిపోతాయి. త్వరగా పెళ్లి జరిగే అవకాశాలు పెరుగుతాయి. గోదాదేవి చేసిన తిరుప్పావై వ్రత ఫలితంగానే ఆమెకు విష్ణుమూర్తి భర్తగా లభించారు’ అని చెబుతున్నారు.


