News September 10, 2025

వాతావరణ శాఖ కార్యాలయం నిర్మాణానికి చర్యలు: కలెక్టర్

image

కోనసీమ ప్రజలు ప్రకృతి వైపరీత్యాల నుంచి జాగ్రత్త పడేందుకు స్థానికంగా భారత వాతావరణ శాఖ కార్యాలయం ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అమలాపురంలో 50 సెంట్ల స్థలాన్ని గుర్తించి శాఖాధికారులతో కలిసి పరిశీలించారు. కార్యాలయం నిర్మాణంపై కలెక్టరేట్ వద్ద కలెక్టర్‌తో చర్చలు జరిపారు. వాతావరణ హెచ్చరికలు, సూచనలు స్థానికంగా అందుబాటులోకి రానున్నందున ప్రజలకు ఉపయోగకరమవుతుందని అధికారులు పేర్కొన్నారు.

Similar News

News December 11, 2025

కుసుంబాయి తండా సర్పంచిగా కొర్ర స్వరూప గెలుపు

image

గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. రఘునాథపల్లి మండలంలోని కుసుంబాయి తండా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా కొర్ర స్వరూప రాజేందర్ నాయక్ గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు. బీఆర్ఎస్ శ్రేణులు స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకుంటున్నారు.

News December 11, 2025

ESIC ఢిల్లీలో 134 సీనియర్ రెసిడెంట్ పోస్టులు

image

<>ESIC<<>> ఢిల్లీ 134 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 18, 19 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.300, SC, STలకు రూ.75. వెబ్‌సైట్: https://esic.gov.in

News December 11, 2025

జయవరం సర్పంచ్‌గా ప్రసాద్ విజయం

image

వేములవాడ రూరల్ మండలం జయవరం గ్రామ సర్పంచ్‌గా ఎండ్రాల ప్రసాద్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీచేసిన ప్రసాద్ తన సమీప ప్రత్యర్థి పరమేష్ పై గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.