News December 3, 2025
వాయు కాలుష్యం అంశంలో నెల్లూరు జిల్లా సేఫ్..!

జిల్లాలో వాయు కాలుష్యం నియంత్రణలో ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘోర విషాదంలో వేలమంది మృతి చెందిన ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా DEC-2న జాతీయ కాలుష్య నివారణ దినంగా పరిగణిస్తారు. జిల్లాలో AQI 52 ఉండడం వలన సేఫ్ జోన్‌లో ఉన్నట్టుగా పరిగణించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Similar News
News February 18, 2026
నెల్లూరు: రంజాన్.. 31 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి.!

31 ఏళ్ల తర్వాత ఫిబ్రవరిలో రంజాన్ మాసం రావడం విశేషం. నేటి(బుధవారం) రాత్రి చంద్ర దర్శనంతో ముస్లింల పవిత్ర మాసమైన రంజాన్ నెల ప్రారంభమవుతుంది. గురువారం తెల్లవారుజాము నుంచి ముస్లింలు తమ ఉపవాస దీక్షలను ప్రారంభించనున్నారు. ఈ నెలలో సేవలు, దానధర్మాలు చేస్తే పుణ్యకార్యంగా భావిస్తారు. మార్చి 19 లేదా 20 తేదిలలో ఉపవాస దీక్షలు ముగుస్తాయి. ఆరోజు ఈద్ ఉల్ ఫితర్‌ను చేసుకోనున్నారు.
News February 18, 2026
5,35,499 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ: DMHO

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో 1-19 సం.లలోపు ఉన్న 5.75,806 పిల్లలలో 5,35,499 మందికి ఆల్బెండజోల్ మాత్రలు మింగించినట్లు DMHO డాక్టర్ వి.సుజాత తెలిపారు. మొత్తంగా 93% ప్రగతి సాధించినట్లు తెలిపారు. మిగిలిన వారికి ఈనెల 24వ తేదీన ఇవ్వనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
News February 18, 2026
కేంద్రీయ విద్యాలయంలో పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

నెల్లూరు రూరల్‌లోని కేంద్రీయ విద్యాలయంలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పలు పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ దొరసానమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. టీచర్, కార్యాలయ సిబ్బంది పోస్టులకు అర్హులైన వారు kothuru.kvs.ac.in లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇంటర్వ్యూలను ఈ నెల 23, 24న తేదీల్లో నిర్వహించనున్నామని చెప్పారు.


