News August 12, 2025

వారు దేశం కోసం ప్రాణాలర్పించి నేటికీ 83 సంవత్సరాలు

image

1942 ఆగస్టు 12 న తెనాలి పట్టణంలో క్విట్ ఇండియా ఉద్యమంలో వందలాది కార్యకర్తలు పాల్గొన్నారు. అప్పుడు పోలీసులు ప్రజలు మధ్య ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసుల కాల్పులలో ఏడుగురు ఉద్యమకారులు ప్రాణాలు అర్పించారు.
★ మాజేటి సుబ్బారావు
★ శిరిగిరి లింగయ్య
★ తమ్మినేని సుబ్బారెడ్డి
★ గాలి రామకోటయ్య
★ ప్రయాగ రాఘవయ్య
★ జాస్తి అప్పయ్య
★ భాస్కరుని లక్ష్మీనారాయణ
వీరి జ్ఞాపకార్థమే మన తెనాలి రణరంగ చౌక్.

Similar News

News March 16, 2026

GNT: రోడ్డు ప్రమాదంలో ప్రొఫెసర్ మృతి

image

విజయవాడ బైపాస్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గుంటూరుకు చెందిన ప్రదీప్ రాజ్ (41) ఏలూరులో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. పెనుగంచిప్రోలు నుంచి ఏలూరు వెళ్తుండగా పిల్లలకు టిఫిన్ తినిపించేందుకు కారు ఆపారు. తిరిగి బయలుదేరుతున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కళ్ల ముందే తండ్రి మరణించడంతో చిన్నారుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 16, 2026

GNT: మిద్దెతోట సాగుదారులకు ఈ నెల 21న పురస్కారాలు

image

ప్రకృతిపై ప్రేమతో మిద్దెతోటలను పెంచుతున్న వారికి పురస్కారాల ప్రదానోత్సవం జరగనుంది. వట్టిచెరుకూరు మండలం కొర్నెపాడులో రైతునేస్తం ఫౌండేషన్ ఈ నెల 21న పురస్కారాలు ప్రదానం చేయనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన 30 మంది మిద్దెతోట పెంపకందారులను ఎంపిక చేశారు. వారికి పురస్కారాలు అందించనున్నట్లు రైతు నేస్తం ఫౌండేషన్ ఛైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలిపారు.

News March 16, 2026

GNT:”ఎస్పీ ఆఫీస్ లో పీజీఆర్ఎస్ రద్దు”

image

గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం రద్దైంది.
పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వచ్చే ప్రజలు విషయాన్ని గమనించి ఎస్పీ కార్యాలయానికి వచ్చే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని SP వకుల్ జిందాల్ సూచించారు. తదుపరి జరిగే పీజీఆర్ఎస్ వివరాలను ముందు రోజు వెళ్లడిస్తామని చెప్పారు.