News November 7, 2025

వాలీబాల్ జట్టుకు ఎంపికైన ములుగు జిల్లా క్రీడాకారులు

image

ఉమ్మడి వరంగల్ జిల్లా వాలీబాల్ జట్టుకు ములుగు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈనెల 13 నుంచి 16 వరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జరగనున్న తెలంగాణా సీనియర్ వాలీబాల్ టోర్నమెంట్‌కు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ములుగు జిల్లా వాలీబాల్ క్రీడాకారులు.. నాలి తరుణ్, కొమరం ఉదయ్, గొంది వసంత్, సోయం నర్సింహ, కొమరం సునీల్, శివ, నరేందర్ ఎంపికయ్యారు.

Similar News

News January 19, 2026

WGL: అనాథ బాలికలకు అండగా ఎస్సై!

image

జిల్లాలోని నెక్కొండ మండలం పెద్దకొర్పోల్‌లో ఇటీవల ఏలియా, మమత దంపతులు మరణించడంతో వారి ఇద్దరు కుమార్తెలు అనాథలయ్యారు. ఈ విషాద ఘటన నెక్కొండ ఎస్సై మహేందర్‌ను కదిలించింది. వారి భవిష్యత్తుపై ఆందోళన చెందిన ఆయన, బాలికలకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. తన సొంత ఖర్చులతో ఇద్దరు పిల్లల కోసం రెండు గదుల ఇంటిని నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు సోమవారం గ్రామంలో స్వయంగా ముగ్గు పోసి భూమి పూజ నిర్వహించారు.

News January 19, 2026

గణతంత్ర పరేడ్‌లో కీరవాణి నాదం.. తెలుగు వ్యక్తికి దక్కిన గౌరవం!

image

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత కీరవాణి ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరనుంది. ‘వందేమాతరం’ గీతం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌కు సంగీతం అందించే బాధ్యతను ఆయన చేపట్టనున్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్న 2500 మంది కళాకారులు ఈ చరిత్రాత్మక ఘట్టంలో భాగం కానున్నారు. ఈ విషయాన్ని కీరవాణి X వేదికగా వెల్లడించారు.

News January 19, 2026

ముంబై మేయర్ పీఠం BJPకి దక్కేనా?

image

ముంబై మేయర్ ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవల జరిగిన మున్సిపోల్స్‌ ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన BJPకి మేయర్ పీఠం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 227 వార్డుల్లో బీజేపీ (89), శివసేన (29) కూటమి 118 సీట్లు సాధించింది. 28న జరిగే కౌన్సిలర్ల మీటింగ్‌లో మేయర్‌ను ఎన్నుకోనున్నారు. శివసేన (UBT) 65, MNS 6, కాంగ్రెస్ కూటమి 24, AIMIM 8, మిగిలిన చోట్ల ఇతరులు విజయం సాధించారు.