News December 1, 2025

వాలీబాల్ టోర్నీ సెమీస్ చేరిన బాలుర జట్లు ఇవే :

image

సిరిసిల్లలో నిర్వహిస్తున్న 8వ రాష్ట్రస్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో బాలుర విభాగంలో ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధించినట్లు రెఫరీ బోర్డు కన్వీనర్ రవీందర్ రెడ్డి, వాలీబాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చెన్నమనేని శ్రీకుమార్ తెలిపారు. ఉమ్మడి నుంచి వచ్చిన పది జట్ల మధ్య నిర్వహించిన పోటీల విజేతల నుండి సెమీస్ కు చేరిన జట్లను ఎంపిక చేశారు.

Similar News

News February 17, 2026

జనగామ.. ‘లక్కీ డ్రా’మా

image

TG: అనూహ్య పరిణామాల మధ్య జనగామ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ముగిసింది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు సమాన ఓట్లు రావడంతో అధికారులు లక్కీ డ్రా తీశారు. ఇందులో కాంగ్రెస్‌నే అదృష్టం వరించింది. ఆ పార్టీకి చెందిన బాలమణి ఛైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. దీంతో BRS సభ్యులు నిరసనకు దిగారు. వైస్ ఛైర్మన్ ఎన్నికను అడ్డుకున్నారు. మరోవైపు తొర్రూరు మున్సిపాలిటీలోనూ లక్కీ డ్రా తీయగా కాంగ్రెస్‌కే ఛైర్మన్(శ్రవణ్) పదవి దక్కింది.

News February 17, 2026

ఫ్లెక్సీల ఏర్పాటుపై కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ఫ్లెక్సీల ముద్రణలో చట్టపరమైన అనుమతులు తప్పనిసరిగా పాటించాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. మంగళవారం అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద కమిటీ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఫ్లెక్సీల వల్ల ఉత్పన్నమవుతున్న శాంతిభద్రతల సమస్యలు, పర్యావరణ ఇబ్బందులపై చర్చించారు. ప్రజలకు ఆటంకం కలగకుండా నిబంధనల మేరకే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

News February 17, 2026

అమలాపురం: చదరంగంలో మీ సత్తా చూపండి

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ‘షాప్ లీగ్’ చదరంగం పోటీలను కలెక్టర్ మహేశ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం జిల్లా నుంచి రాష్ట్రస్థాయి వరకు మల్టీ స్పోర్ట్స్ లీగ్ నిర్వహిస్తోందని తెలిపారు. 12 నుంచి 20 ఏళ్ల వయసున్న క్రీడాకారులకు ఈ పోటీలు జరుగుతున్నాయి. ప్రతిభావంతులైన యువతను వెలికితీయడమే లక్ష్యమని కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ పేర్కొన్నారు.