News August 21, 2025
వాస్తు పేరుతో ఇంద్రకీలాద్రిపై రూ.కోట్లు స్వాహా?

దుర్గమ్మ ఆలయంలో భక్తులకు అన్న ప్రసాదం, లడ్డూ ప్రసాదాలు పంపిణీ చేసే శాశ్వత భవనాలు లేకపోవడం సమస్యగా మారింది. ఓ ఇంజినీరింగ్ అధికారి, ఆలయ ఆస్థాన విధ్వాంసుడి నిర్వాకం వల్ల వీటిని నిర్మించలేదని ఆరోపణలున్నాయి. గతంలో ఒకట్రెండు చోట్ల నిర్మాణాలు చేపట్టి వాస్తు దోషం పేరిట కూల్చి.. రూ.కోట్లు దండుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అధికారుల పని తీరు వల్లే భక్తులు అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడింది.
Similar News
News January 23, 2026
వర్ధన్నపేట MLA క్యాంపు ఆఫీస్‌లో శిలాఫలకం తొలగింపు

వర్ధన్నపేట MLA క్యాంపు కార్యాలయంలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని తొలగించి పక్కనే ఉన్న చెట్లలో పడేసిన ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది. ఈ ఘటనకు ప్రస్తుత MLA కేఆర్ నాగరాజు బాధ్యత వహించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఆస్తులపై ఇలాంటి చర్యలు తగవని, ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై అధికారిక స్పందన కోసం స్థానికులు ఎదురు చూస్తున్నారు.
News January 23, 2026
కాజీపేట వరకే సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలు

భద్రాచలం రోడ్-బల్లార్షా మధ్య నడిచే 17033/17034 సింగరేణి ఎక్స్‌ప్రెస్ మెమో రైలు ఈనెల 24 నుంచి ఫిబ్రవరి 14 వరకు పూర్తి స్థాయిలో కాకుండా, కాజీపేట వరకు నడవనుందని రైల్వే అధికారులు తెలిపారు.మందమర్రిలో 3వ లైన్ పనులు, ట్రాక్ మరమ్మతు నేపథ్యంలో ఈ మార్పు అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు గమనించి ప్రత్యామ్నాయ రైళ్లను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. పనులు పూర్తయిన తర్వాత రైలు యధావిధిగా నడవనుందన్నారు.
News January 23, 2026
పాడేరు: మీకోసం కార్యక్రమానికి 102 ఫిర్యాదులు

పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 102 ఫిర్యాదులు అందాయి. జిల్లా ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయన్నారు. మీ కోసంలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆమె ఆదేశించారు.


